ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేనలో ఇప్పుడు ప్రక్షాళన మొదలైందని చెప్పక తప్పదు. తన మాట నమ్మి కూటమికి ఓటేసిన ఏపీ ఓటర్ల సంక్షేమం పట్ల ఇప్పటిదాకా ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ అదినేత పవన్ కల్యాణ్… డిప్యూటీ సీఎం హోదాలో పాలనపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి సంబంధించి కొంతకాలం పాటు ఆయన దృష్టి సారించలేదని చెప్పక తప్పదు. అయితే ఇటీవలి కాలంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన పవన్… పరిస్థితులు చక్కగా లేని పార్టీ శాఖలపై ఓ కన్నేశారు. అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి రిపేర్లు అవసరమో.. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
నిత్యం అభిప్రాయ బేధాలతో వార్తల్లో నిలుస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా శాఖను ఇదివరకే రద్దు చేస్తూ పవన్ కల్యాణ్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ శాఖను కూడా సమూలంగా రద్దు చేస్తూ ఆయన ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన జిల్లా కార్యవర్గంతో పాటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల పార్టీల కార్యవర్గాలన్నీ రద్దు అయిపోయాయి.
ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కార్యవర్గాన్నింటినీ రద్దు చేసిన పవన్… ఆ జిల్లాలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయమే చూసుకుంటుందని పవన్ ప్రకటించారు. పార్టీ జిల్లా శాఖకు చెందిన నాయకుల్లో క్రమశిక్షణ లోపించిందని, ఫలితంగా జిల్లా శాఖ బాధ్యులపై వరుసబెట్టి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పిన కేంద్ర కార్యాలయం…. జిల్లాలో కట్టుతప్పిన పార్టీ నేతలను దారిలోకి తీసుకుని వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. నేతల క్రమశిక్షణా రాహిత్యం వల్ల పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
మొత్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన శాఖను పూర్తిగా రద్దు చేసిన పవన్ కల్యాణ్… ఇకపై పార్టీలో ఇష్టానుసారం వ్యవహరిద్దామనుకుంటున్న నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ పరిస్థితులపై దృష్టి సారించిన పవన్ అతి తక్కువ వ్యవధిలోనే రెండు జిల్లాల కమిటీలను రద్దు చేయడం చూస్తుంటే… క్రమశిక్షణ లేని నేతలకు పార్టీ అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేసినట్టేనన్నవిశ్లేషణలూ సాగుతున్నాయి. పార్టీ జిల్లా కమిటీలను రద్దు చేసే తరహా చర్యలు కఠిన చర్యలే అయినా… ఆ తరహా చర్యలు లేకపోతే పరిస్థితి అదుపులోకి రాదన్న భావనతోనే పవన్ ఈ మేర ఒకింత గట్టి నిర్ణయాలే తీసుకుంటున్నారని చెప్పక తప్పదు.
This post was last modified on June 8, 2026 7:07 am
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…