ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరిగా పేరు సంపాదించిన లోక నాయకుడు.. ఆయన నేరుగా తెలుగులో అద్భుతమైన సినిమాలు చేశారు. కెరీర్లోనే అత్యుత్తమం అనదగ్గ చిత్రాల జాబితాలో నిలిచే సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, లాంటి సినిమాలు స్ట్రెయిట్ తెలుగువే. ఈ చిత్రాల రూపకర్తలైన కె.విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావులపై కమల్‌కు అమితమైన అభిమానం ఉంది.
ఈ ఇద్దరి మీద అపారమైన గౌరవ మర్యాదలు చూపిస్తుంటారు కమల్. ఇప్పుడు సింగీతం మీద తన గురుదక్షిన చూపించే అవకాశం కమల్‌కు లభించింది. 94 ఏళ్ల వయసులోనూ ఎంతో ఓపికతో సింగ్ గీతం సినిమా తీసి చరిత్ర సృష్టించారు సింగీతం. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో కమల్ హాసన్ భాగం కాబోతుండడం విశేషం.
ఆదివారం సింగ్ గీతం ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు కమల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. దర్శకుడు సింగీతంతో పాటు నిర్మాత నాగ్ అశ్విన్ తదితరులు ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. కొన్ని రోజులుగా కమల్ కల్కి-2 షూట్ కోసం హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తాను గురువుగా భావించే సింగీతం కోసం ఆయన ఈ వేడుకకు రానున్నాడు.
ఈ చిత్రాన్ని నిర్మించింది కల్కి 2 దర్శకుడైన నాగి కావడంతో మరింత సంతోషంగా కాల్ ఈ ఈవెంట్ కు రావడానికి మరో కారణం. మరి 94 ఏళ్ల యువ దర్శకుడి గురించి లోక నాయకుడు ఏం మాట్లాడతాడు అన్నది ఆసక్తికరం. అసలు ఈ వయసులో ఇంత ఓపికతో ఒక ఫీచర్ ఫిలిం తీయడం గురించి సింగీతం ఏం మాట్లాడతారు అన్నది కూడా ఎంతో క్యూరియాసిటి పెంచేదే. ఈ వేడుకలో కమల్, నాగి.. కల్కి 2కు సంబంధించి ఏమైనా విశేషాలు పంచుకుంటారా అని కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 7, 2026 10:57 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…