Movie News

వార‌ణాసి విల‌న్‌ క్యారెక్టర్… రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

రాజమౌళి, మ‌హేష్ బాబుల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న వార‌ణాసి సినిమాలో రామాయ‌ణం నేప‌థ్యంలో ఒక అరగంట యుద్ధ స‌న్నివేశాలు ఉంటాయ‌ని వార్త‌లు రాగానే.. ఆ యుద్ధం రాముడికి, రావ‌ణుడికి మ‌ధ్య ఉంటుంద‌నే అంచ‌నాతోనే ఉన్నారంద‌రూ. కానీ ఎన్నోసార్లు ఇండియ‌న్ సినిమాల్లో, సీరియ‌ళ్ల‌లో చూసిన ఎపిసోడ్‌ను రాజ‌మౌళి ఎంత కొత్త‌గా చూపిస్తాడో అనే చ‌ర్చ జ‌రిగింది.

కానీ ఇందులో చూపించే యుద్ధం రాముడికి, రావ‌ణుడికి కాద‌ని.. రాముడికి, కుంభ‌క‌ర్ణుడికి మ‌ధ్య అని తాజాగా ఈ చిత్ర రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ వెల్ల‌డించారు. అంతేకాక ఈ ఎపిసోడ్ స్పెల్ బౌండ్ అయ్యేలా ఉంటుంద‌ని కూడా ఆయ‌న కామెంట్ చేశారు. దీంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. రామాయ‌ణంలో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించే కుంభ‌క‌ర్ణుడి క్యారెక్ట‌ర్‌ను రాజ‌మౌళి ఎలా ప్రెజెంట్ చేస్తాడు.. అత‌డితో రాముడి యుద్ధాన్ని ఎంత ర‌స‌వ‌త్త‌రంగా తెర‌కెక్కిస్తాడు అని అంద‌రూ క్యూరియాసిటీ ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

వార‌ణాసిలో కుంభ‌క‌ర్ణుడి పాత్ర‌కు ఇవ్వ‌నున్న ప్రాధాన్యాన్ని బ‌ట్టి.. పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్న విల‌న్ పాత్ర మీద కూడా ఒక క్లారిటీ వ‌చ్చేసింది. ఈ పాత్ర పేరును కుంభ‌గా ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పాత్ర ఫ‌స్ట్ లుక్‌లో పృథ్వీరాజ్ చ‌క్రాల కుర్చీకి ప‌రిమిత‌మై క‌నిపించాడు. రామాయ‌ణం క‌థ తెలిసిన వాళ్ల‌కు కుంభ‌క‌ర్ణుడికి ఏమైందో ఒక‌సారి గుర్తు చేసుకుంటే ఈ క్యారెక్ట‌ర్ అలా క‌నిపించ‌డంలో ఆంత‌ర్యం అర్థ‌మ‌వుతుంది.

రాముడు.. కుంభ‌క‌ర్ణుడిని చంప‌కుండా త‌న కాళ్లూ చేతులు తెంచేస్తాడు. త్రేతాయుగం నాటి కుంభ‌క‌ర్ణుడి పాత్ర‌కు వ‌ర్త‌మానంలో కుంభ పాత్ర ప్ర‌తీక‌గా నిలుస్తుంద‌న్న‌మాట‌. రాముడి పాత్ర‌కు మ‌హేష్ చేసిన రుద్ర పాత్ర ప్ర‌తిబింబంగా భావించ‌వ‌చ్చు.

కాబ‌ట్టి రామాయ‌ణం ఎపిసోడ్‌లో మ‌హేష్ రాముడిగా క‌నిపిస్తే.. కుంభ‌క‌ర్ణుడిగా క‌నిపించేది పృథ్వీరాజే అని ఫిక్స‌యిపోవ‌చ్చు. మొత్తానికి రామాయ‌ణ గాథ‌కు, వ‌ర్త‌మానానికి రాజ‌మౌళి భ‌లే లింక్ క‌లిపిన‌ట్లే క‌నిపిస్తున్నాడు. ఎంతో ఆస‌క్తి రేకెత్తించేలా ఉన్న ఈ క‌థ‌ను రాజ‌మౌళి త‌న‌దైన శైలిలో ప్రెజెంట్ చేస్తే వార‌ణాసి మూవీ బాక్సాఫీస్ పెర్ఫామెన్సుకి ఆకాశ‌మే హ‌ద్ద‌న్న‌మాట‌.

This post was last modified on June 6, 2026 10:14 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago