తెలుగు రాష్ట్రాల్లో పెద్ది వసూళ్ల పరంగా బలంగా ఉంది. చాలా బాగుంది నుంచి యావరేజ్ దాకా టాక్ ఎలా ఉన్నప్పటికీ రామ్ చరణ్ స్టార్ పవర్ తో పాటు అతను ఈ సినిమా కోసం పడిన కష్టం జనాన్ని థియేటర్లకు తీసుకొస్తున్న మాట వాస్తవం. ముఖ్యంగా ఆంధ్ర బెల్ట్ లో పెద్ది వసూళ్లు భారీగా ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు ప్రభావం నైజామ్ లో కనిపిస్తోంది. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఒక సింగల్ స్క్రీన్ ఒక టికెట్ 420 రూపాయల ధర పెట్టడాన్ని అభిమానులే సమర్ధించలేకపోతున్నారు.
దీని సంగతలా ఉంచితే పెద్ది పరుగు ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం నెమ్మదిగా ఉంది. భోపాల్ లో అంత పెద్ద ఈవెంట్, ముంబై ఢిల్లీలో ప్రెస్ మీట్లు గట్రా పెట్టి, ప్రమోషన్స్ పరంగా ప్రచారంలో టీమ్ ఎలాంటి లోపం లేకుండా చూసుకుంది. అయితే బాలీవుడ్ జనాలు పుష్ప 2, కెజిఎఫ్ 2 లాగా మొదటిరోజే చూసేయాలన్న స్థాయిలో ఎగబడలేదు. కారణం జానర్. పెద్ది దేనికీ సీక్వెల్ కాదు. కెజిఎఫ్ లాగా ఎలివేషన్లు, కాంతర లాగ డివోషన్లు లేవు. ఒక నిజాయితీ ఆటగాడి కథను చెప్పారు.
దాని వల్ల టాక్ కోసం ఎదురు చూసిన హిందీ ఆడియన్స్ మెల్లగా థియేటర్లకు టర్న్ అవుతున్నారు. ఇప్పటిదాకా అయిదు కోట్ల నెట్ వసూళ్లు దాటినట్టు ట్రేడ్ టాక్. పోటీలో ఉన్న వరుణ్ ధావన్ ‘హై జవానీతో ఇష్క్ హోనాహై’కు డిజాస్టర్ టాక్ రావడం, బాబి డియోల్ ‘బందర్’ అన్ని వర్గాలను మెప్పించేలా లేకపోవడం పెద్దికి వరంగా మారొచ్చు. మరీ రికార్డులు షేక్ అయ్యే స్థాయిలో కాదు కానీ ఆక్యుపెన్సీలు డీసెంట్ గా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం.
అసలైన సమస్య మరొకటి ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు హిందీలో ఇప్పటికే చాలా వచ్చేశాయి. దంగల్, సుల్తాన్, చందూ ఛాంపియన్, గోల్డ్, ఝున్డ్, మైదాన్, కోయ్ పోచే, మేరీ కామ్, భాగ్ మిల్కా భాగ్, ధోని. సచిన్, ఇక్బాల్, పాన్ సింగ్ తోమర్ ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైనే తేలుతాయి.వాటిలో లేని పాయింట్ పెద్దిలో ఉన్నప్పటికీ జనాలు దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఈ వారం రోజుల్లో పెద్ది ఏ మేరకు రాబడుతుందనే దాన్ని బట్టి హిందీ వెర్షన్ స్టేటస్ డిసైడవుతుంది.
This post was last modified on June 6, 2026 9:35 am
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…