Movie News

రావిపూడి రూటే వేరు

టాలీవుడ్ దర్శకుల్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప సక్సెస్ రేట్ ఉన్న స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడినే. అతనేమీ పెద్ద బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా అని.. వరల్డ్ బిల్డింగ్ అని భారీగా ఖర్చు పెట్టించడు. మేకింగ్‌లో పర్ఫెక్షన్ పేరుతో ఏళ్లకు ఏళ్లు సినిమా తీసి నిర్మాతల మీద భారం మోపడు. ప్రతిసారీ పెద్ద హీరోనే కావాలని ఎదురు చూడడు. అందుబాటులో ఉన్న హీరోతో తన పరిధిలో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లు తీసి పెట్టుబడి మీద కొన్ని రెట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న అరుదైన దర్శకుల్లో అతనొకడు.

గత సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిల్.. ఈ సంవత్సరం ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీతో ప్రకంపనలు రేపాడు. వరుసగా మూడో ఏడాది కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విక్టరీ వెంకటేష్‌తో అతను సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదికి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

ఐతే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసి.. తర్వాతి సంక్రాంతికి కొత్త సినిమా తీసుకురావాలనుకున్నపుడు ఆ దర్శకుడి మీద ఎంత ప్రెజర్ ఉంటుందో, తనెంత బిజీగా ఉంటాడో చెప్పేదేముంది? కానీ వెంకీ మూవీని మొదలుపెట్టడానికి ముందు అనిల్ తాపీగా టీవీ షోలు చేసుకుంటుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

మామూలుగా దర్శకులు టీవీ షోలను తక్కువగా చూస్తారు. తమ సినిమాల ప్రమోషన్లకు కూడా టీవీ షోలకు వెళ్లరు. అలాంటిది అనిల్ మాత్రం ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే షోకు జడ్జిగా వ్యవహరించాడు. రెండు నెలల పాటు ఈ షో నడిచింది.

ఓవైపు డెడ్ లైన్ల మధ్య వెంకీ మూవీకి స్క్రిప్టు రెడీ చేస్తూ.. ఇలా ఒక టీవీ షోకు జడ్జిగా వ్యవహరించడం చిన్న విషయం కాదు. ఊరికే షోలో గంటా రెండు గంటలు కూర్చుని వెళ్లిపోవడం అంటే కుదరదు. షో మొత్తాన్ని ఫాలో అవ్వాలి. అందులో ఇన్వాల్వ్ అయి జడ్జిమెంట్ ఇవ్వాలి.

అనిల్ స్థాయి దర్శకుడు తనకు ఇంత డిమాండ్ ఉన్న టైంలో, ఇంత బిజీగా ఉంటూ షో చేయడం ఊహకందని విషయం. ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ షో అయ్యాక ఇంకో టీవీ షోకు కూడా అనిల్ గెస్టుగా వచ్చాడు. దాని ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇంత బిజీ టైంలో ఇదంతా ఎందుకు అనిపించొచ్చు.

కానీ తన టార్గెటెడ్ ఆడియన్స్ ఫ్యామిలీసే కాబట్టి వాళ్లకు మరింత కనెక్ట్ కావడానికి అనిల్ దీన్నొక అవకాశంగా భావిస్తుండొచ్చు. కుటుంబ ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఇలాంటి షోల నుంచి కూడా అతను ఇన్‌పుట్స్ తీసుకుంటుండొచ్చు. కాబట్టే తన ప్రతి సినిమాకూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను పెద్ద ఎత్తున థియేటర్లకు తీసుకురాగలుగుతున్నాడు అనిల్.

This post was last modified on June 6, 2026 8:29 am

Share

Recent Posts

స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై జెన్ జీ

ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళన ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో తీవ్రమైన ఎఫెక్ట్…

52 minutes ago

వర్మ పోలీసు కంపెనీ హడావిడి ఎలా ఉంది?

రాం గోపాల్ వర్మ అంటేనే ఒక బ్రాండ్. ఆయన సినిమాలకు హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేదు.…

6 hours ago

యష్‌ను హీరోయిన్స్ మింగేస్తారా?

రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమా 'టాక్సిక్' ట్రైలర్, ప్రోమోలు చూస్తుంటే ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది.…

9 hours ago

బాలయ్య స్టెప్ విషయంలో బాధపడ్డ మాస్టర్

టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ కొరియోగ్రాఫర్ స్థానానికి గట్టి పోటీదారుల్లో ఒకడు శేఖర్ మాస్టర్. గత దశాబ్ద కాలంలో అతను…

9 hours ago

సీఎం విజ‌య్‌కు జై కొట్టిన డీఎంకే ఉద‌య‌నిధి!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్తులుగా ఉన్న వారు అన్ని విష‌యాల్లోనూ క‌య్యానికి కాలు రువ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌లు సంద‌ర్భాల్లో త‌మిళ‌నాడు రాష్ట్ర…

10 hours ago

పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచినే

అదేంటో విచిత్రంగా డిసి సినిమాకు తమిళనాడు కంటే ఏపీ తెలంగాణలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. సోమవారం గ్రాస్ చూసుకుంటే మన…

11 hours ago