Movie News

ఏంటి తారక్ ఈ అల్లరి

స్టార్ హీరోలను అభిమానులు ఎంత నిస్వార్థంగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అభిమానులకు కొదవే ఉండదు. హీరోలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా మంచి సినిమాలు చేస్తే చాలు.. వాళ్లు అంతకంటే ఏమీ ఆశించరు. ఎప్పుడైనా అవకాశం వచ్చి ఒక ఫొటో తీసుకునే ఇస్తే ఉబ్బితబ్బిబ్బయిపోతుంటారు.

అలాంటి అభిమానుల్లో ఒకరు తన ఆరాధ్య కథానాయకుడిని ట్యాగ్ చేసి ఒక కామెంట్ చేస్తే.. ఆ ఫ్యాన్‌కు స్టార్ హీరో రిప్లై ఇవ్వడమే కాక, ఒక బహుమతిని కూడా పంపిస్తే తన ఆనందానికి అవధులు ఏముంటాయి? టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఇదే పని చేశాడు. తన అభిమానిని సంబరాల్లో ముంచెత్తాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

తారక్ తాజాగా తన ఇంట్లో కుకీస్ తయారు చేసి, వాటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన చేతులతో స్వయంగా ఈ కుకీస్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ పోస్టును స్క్రీన్ షాట్ తీసి, ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘‘మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉణ్నారు రెండు కుకీస్ పంపించు అన్నా’’ అంటూ సాయితేజ అనే అభిమాని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. ఆశ్చర్యకరంగా తారక్ ఈ పోస్టుపై స్పందించాడు. అది కూడా తనదైన శైలిలో.

బ్రహ్మానందం మీద ‘అడ్రస్ పెట్టు.. అడ్రస్ పెట్టు’ అంటూ తయారు చేసిన ఒక మీమ్‌ను పోస్టు చేశాడు. దీంతో ఆ ఫ్యాన్ వెంటనే అడ్రస్ షేర్ చేశాడు. తనకు తారక్ రిప్లై ఇచ్చిన పోస్టును షేర్ చేస్తూ.. దేవుడు తారక్ మీద తన ప్రేమను గుర్తించి ఈ అవకాశం కల్పించాడని.. తారక్ పంపే కుకీస్ కోసం ఎదురు చూస్తున్నానని.. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజని చాలా ఎమోషనల్‌గా పోస్టు పెట్టాడు.

స్టార్ హీరోలంటే అభిమానులకు అందనంత ఎత్తులో ఉంటారనుకుంటాం కానీ.. ఇలాంటి చర్యలతో ఫ్యాన్స్ మీద వారికున్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. అభిమాని పోస్టుకు స్పందించడం ఒకెత్తయితే.. తారక్ వాడిన మీమ్ రెఫరెన్స్ అతను సోషల్ మీడియాతో ఎంత బాగా కనెక్ట్ అయి ఉంటాడో తెలియజేస్తుంది. ఇలాంటి చర్యలు అభిమానులతో హీరోల బాండింగ్‌ను ఎంతో పెంచుతాయనడంలో సందేహం లేదు.

This post was last modified on June 6, 2026 11:17 am

Share

Recent Posts

నాని జడల లుక్… అందరూ వద్దే వద్దన్నా

టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…

60 minutes ago

ఎగతాళి చేస్తారని ఆ విషయం దాచేసిన సందీప్ కిషన్

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…

60 minutes ago

లైవ్ లోనే టీ-షర్ట్ విప్పేసిన సల్మాన్ ఖాన్

నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…

2 hours ago

విద్యార్థినుల సింగిల్ జడలు కత్తిరించింది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…

2 hours ago

నిన్న మల్లెపూల పల్లకి… రేపు రఘుకుల తిలకా రారా

ఫిలిం ఇండ‌స్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్ట‌యిందంటే.. ఆ చిత్రానికి క‌లిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు త‌మ చిత్రాల్లో…

2 hours ago

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్.. చిరు మాస్టర్ ప్లాన్

వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…

6 hours ago