Movie News

బయటికి ఎప్పుడు వస్తావు నాయకా

జూన్ నెల వచ్చేసింది. కొత్త రిలీజులు క్యూ కడుతున్నాయి. పెద్ది ఆల్రెడీ ఓపెనింగ్ రికార్డులు మొదలుపెట్టేసింది. వచ్చే వారం నుంచి సింగ్ గీతం, మా ఇంటి బంగారం, లెనిన్ అంటూ చెప్పుకోదగ్గ క్యూ కనిపిస్తోంది. విజయ్ జన నాయకుడు మాత్రం కనుచూపు మేరలో లేదు. విజయ్ సిఎం అయిపోయి నెల దాటేసింది. పాలనలో తన ముద్ర చూపిస్తున్నారు. అయినా సరే కెవిఎన్ ప్రొడక్షన్స్ దాన్ని సానుకూలంగా వాడుకునే సూచనలు లేకపోవడం చూసి ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు.

చెన్నై టాక్ ఇలా ఉంది. ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చి దాని మీద వడ్డీల భారం మోస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇచ్చేలా ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు తెలిసింది. సెన్సార్ నుంచి ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో ఇంకా అంతు చిక్కడం లేదు. ఇది ప్రభుత్వం ద్వారా నడిచే వ్యవస్థ అయినప్పటికీ నిబంధనలు కఠినంగా ఉన్న నేపథ్యంలో దాని వ్యవహారంలో కల్పించుకోకూడదని విజయ్ చెప్పడం వల్లే విచక్షణాధికారం సెన్సార్ కే వదిలేశారట.

ఒకవేళ పెట్టుబడులు తిరిగి ఇచ్చే పక్షంలో కెవిఎన్ సంస్థ స్వంత రిలీజ్ కు సిద్ధపడుతుంది. వసూళ్ల పరంగా ప్రొడ్యూసర్ చాలా ధీమాగా ఉన్నారట. తమిళనాడు ముఖ్యమంత్రి సినిమా కాబట్టి జనం ఎగబడి చూస్తారని, రికార్డులు గల్లంతు కావడం ఖాయమని అంటున్నారు. భగవంత్ కేసరి రీమేక్ కనక తెలుగులో పెద్దగా అద్భుతాలు చేసే అవకాశాలు లేనట్టే. మలయాళం, కన్నడ మార్కెట్ల మీద పంపిణీదారులు నమ్మకం పెట్టుకున్నారు.

సో జన నాయకుడు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా శ్రీలీల పాత్రను మమిత బైజు పోషించింది. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ విలన్లుగా కనిపించనున్నారు. మతపరమైన అంశాలతో పాటు రాజకీయంగా కొన్ని వివాదాస్పద విషయాలు ఉండటం వల్లే జన నాయకుడు సెన్సార్ ఆఫీస్ లో పోరాడుతున్నట్టు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

This post was last modified on June 4, 2026 10:15 pm

Share

Recent Posts

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

17 minutes ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

51 minutes ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

2 hours ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

2 hours ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

13 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

13 hours ago