Movie News

జాన్వీ ఎందుకు టార్గెట్ అయ్యింది

తాజాగా విడుదలైన పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద సోషల్ మీడియాలో గట్టి చర్చే జరుగుతోంది. అసలామె క్యారెక్టర్ ని దర్శకుడు బుచ్చిబాబు డిజైన్ చేసిన తీరు మీద పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. కేవలం రెండు పాటల్లో డాన్స్ చేసి గ్లామర్ షో చేయడానికి తప్ప తనకు పెద్దగా వాడుకుంది లేదనేది అధికశాతం వెలిబుచ్చుతున్న అభిప్రాయం. తన డెబ్యూ దేవర ఎంత పెద్ద హిట్టయినా అందులో కూడా ఈ జూనియర్ శ్రీదేవికి దొరికిన స్పేస్ తక్కువే.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కథ ప్రకారం పెద్ది ప్రేమకథను ఎక్కువ చెప్పడానికి లేదు. స్టోరీలో ఉన్న కోర్ ఎలిమెంట్ కొండకింద ఊరికి రైలు ఆగడం. దాని మీద జగపతిబాబు పాత్ర సాగుతుంది. పెద్ది ఆటకూలిగా చేసే విన్యాసాలు సెకండాఫ్ డ్రైవ్ కు ఉపయోగపడతాయి కాబట్టి క్రికెట్ ని ఎక్కువ ఉపయోగించుకున్నారు. దీని వల్ల లవ్ ట్రాక్ కొంచెం తేలిపోయినట్టు అనిపించిన మాట వాస్తవం. ఇద్దరి కెమిస్ట్రీ సరిగా రెజిస్ట్ర కాలేదన్నది నిజం.

ఈ అంశం ఆధారంగా పెద్ది టాక్ మారిపోదు కానీ జాన్వీ కపూర్ మాత్రం ఇది తనకు పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో అన్ని ఈవెంట్లకు వచ్చింది, ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కొన్ని సీన్లు లెన్త్ వల్ల తగ్గించాల్సి వచ్చిందట. అందుకే సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ముందు వరకు తనకు కనిపించే ఆస్కారం దొరకలేదు అంటున్నారు. సి సెంటర్స్ లో తన ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తున్న దాఖలాలు లేకపోలేదు. బుచ్చిబాబు ఉద్దేశం అదే.

జాన్వీ కపూర్ కు మరో హిట్టు దొరికిందా లేదానేది ఇంకొన్ని రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అయినా రామ్ చరణ్ అంత టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ తో కట్టొపడేస్తున్నప్పుడు వేరొకరికి గుర్తింపు రావడం కష్టం. అది హీరోయిన్ అయినా సరే. ఒకవేళ పెద్ది కనక సక్సెస్ అయితే జాన్వీ కపూర్ కు లక్కీ గర్ల్ అనే బిరుదు వచ్చేస్తుంది. ఇవాళ తన సినిమా విడుదల సందర్భంగా తిరుమలకు కాలి నడకన మెట్ల మార్గం ద్వారా వెళ్లి దర్శనం చేసుకున్న జాన్వీకి ఏమేం ఆఫర్లు వస్తాయో చూడాలి.

This post was last modified on June 4, 2026 9:59 pm

Share

Recent Posts

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

17 minutes ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

18 minutes ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

1 hour ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

2 hours ago

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

2 hours ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

3 hours ago