Movie News

సెంచ‌రీ కొట్టేసిన పెద్దిగాడు

కొన్ని నెల‌లుగా స‌రైన పెద్ద సినిమా లేని టైంలో రిలీజైంది పెద్ది. ప్రేక్ష‌కులు ఆవురావురుమ‌ని ఉన్న టైంలో విడుద‌ల కావ‌డం దీనికి అతి పెద్ద ప్ల‌స్. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు అద‌న‌పు రేట్లు ఇచ్చారు. ముందు రోజు పెద్ద ఎత్తున పెయిడ్ ప్రిమియ‌ర్స్ కూడా ప‌డ్డాయి. ఇంకేముంది వ‌సూళ్ల మోత మోగిపోయింది. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా ఉండ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎదురే లేకుండా దూసుకుపోయేలా క‌నిపిస్తోంది పెద్ది.

అన్నీ క‌లిసొచ్చి రామ్ చ‌ర‌ణ్ కెరీర్లో తొలిసారిగా మొద‌టి రోజే వంద కోట్ల వ‌సూళ్ల మార్కును అందుకోబోతున్నాడ‌న్న‌ది ట్రేడ్ స‌మాచారం. తెలుగు రాష్ట్రాల్లో బుధ‌వారం ప‌డ్డ పెయిడ్ ప్రిమియ‌ర్స్ నుంచే రూ.20 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ష‌న్లు వ‌చ్చినట్లు స‌మాచారం. ఇక ఏపీ, తెలంగాణ‌లో రిలీజ్ రోజైన‌ గురువారం రూ.40 కోట్ల‌కు త‌క్కువ కాకుండా గ్రాస్ కలెక్ష‌న్లు వ‌స్తాయ‌ని అంచ‌నా. పొరుగు రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క నుంచి ఏపీ, తెలంగాణ‌కు దీటుగా వ‌సూళ్లు వచ్చే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

ఇండియాలోని మిగ‌తా రాష్ట్రాల్లో చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు రాక‌పోవ‌చ్చు. కానీ యుఎస్ స‌హా విదేశాల్లో పెద్ది భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌నున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. యుఎస్‌లో ప్రిమియ‌ర్స్‌తోనే ఈ చిత్రం 1.5 మిలియ‌న్ డాల‌ర్లు కొల్ల‌గొట్టింది. గురువారం కూడా అక్క‌డ‌ సినిమా స్ట్రాంగ్‌గా నిల‌బ‌డ్డ సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

గురువారం సెకండ్ షోలు ముగిసేస‌రికి మొత్తంగా వ‌ర‌ల్డ్ వైడ్ పెద్ది వ‌సూళ్లు రూ.100 కోట్ల మార్కును ఈజీగా దాటేస్తాయ‌ని అంచ‌నా. సోలో హీరోగా చ‌ర‌ణ్ కెరీర్లో ఇప్ప‌టిదాకా ఏ సినిమాకూ ఈ స్థాయి వ‌సూళ్లు రాలేదు. గ‌త ఏడాది గేమ్ చేంజ‌ర్ సినిమాకు తొలి రోజు వ‌సూళ్లు రూ.180 కోట్లు దాటిన‌ట్లు పోస్ట‌ర్ అయితే రిలీజ్ చేశారు కానీ.. అది రియ‌ల్ కాద‌ని అంద‌రికీ తెలుసు.

ఆర్ఆర్ఆర్ రూ.200 కోట్ల మేర వ‌సూళ్లు సాధించినా అందులో రామ్ చ‌రణ్ సోలో హీరో కాదు. పెద్ది సినిమాను త‌న భుజాల మీద మోసిన చ‌ర‌ణ్‌.. ఈ సినిమా స‌క్సెస్, వ‌సూళ్ల విష‌యంలో మేజ‌ర్ క్రెడిట్ తీసుకోబోతున్నాడు. త‌న బాక్సాఫీస్ స్టామినాకు ఈ సినిమాకు ఒక రుజువుగా నిల‌వ‌బోతోంది.

This post was last modified on June 4, 2026 11:33 pm

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

2 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

5 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

5 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

6 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

6 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

7 hours ago