Movie News

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన రెగ్యుల‌ర్ రేట్ల‌తోనే రిలీజ్ అయ్యేది. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడ‌డం ద్వారా ఎక్కువ ఆదాయం రాబ‌ట్టుకునేది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమాలకు లాంగ్ ర‌న్ లేని నేప‌థ్యంలో, టికెట్ల రేట్లు పెంచుకుని తొలి వీకెండ్లోనే వీలైనంత వెన‌క్కి రాబ‌ట్టుకోవాల‌ని ఇటు నిర్మాత‌లు, అటు బయ్య‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సులువుగానే అనుమ‌తులు వ‌చ్చేస్తున్నాయి కానీ.. తెలంగాణ‌లో మాత్రం రేట్ల పెంపు సాధ్య‌ప‌డ‌ట్లేదు. గ‌త ఏడాది సెల‌క్టివ్‌గా కొన్ని సినిమాల‌కు రేట్లు ఇచ్చినా.. ఈ ఏడాది మ‌ళ్లీ క‌థ మారింది. ప్ర‌భాస్ సినిమా ది రాజాసాబ్‌కు చివ‌రి నిమిషం వ‌ర‌కు టెన్ష‌న్ త‌ప్ప‌లేదు.

రిలీజ్ ముందు రోజు మిడ్ నైట్ వ‌ర‌కు జీవో రాక‌పోవ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు బుకింగ్సే ఓపెన్ కాలేదు. చివ‌రికి నార్మ‌ల్ రేట్ల‌తోనే సినిమాను రిలీజ్ చేసుకున్నారు. ముందే బుకింగ్స్ మొద‌లుపెట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల ఎంత ఆదాయం కోల్పోయారో అంచ‌నా కూడా వేయ‌లేని ప‌రిస్థితి. అది ప‌ది కోట్ల‌కు త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం లేదు.

కానీ త‌ర్వాత చిరంజీవి సినిమా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారుకు రేట్ల పెంపు జీవో ముందే రావ‌డంతో బుకింగ్స్ సాఫీగా సాగాయి. ఆ సినిమాకు బాగా ప్ర‌యోజ‌నం పొందింది. కానీ సంక్రాంతి త‌ర్వాత మ‌ళ్లీ రేట్ల పెంపు విష‌యంలో పీట‌ముడి బిగుసుకుంది. స‌మ్మ‌ర్ ఆరంభంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌కు రేట్లు పెంచుకోవ‌డానికి చూశారు. కానీ ఫ‌లితం లేక‌పోయింది.

జీవో కోసం చూసి చూసి ఆల‌స్యంగా నార్మ‌ల్ రేట్ల‌తో బుకింగ్స్ మొద‌లుపెట్టారు. దీని వ‌ల్ల సినిమా ఓపెనింగ్స్ మీద ప్ర‌భావం ప‌డింది. ఈ అనుభ‌వాలు క‌ళ్ల ముందు ఉండ‌గానే.. పెద్ది సినిమాకు కూడా తెలంగాణ‌లో రేట్ల పెంపుకోసం ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్నారు. ఏపీలో రిలీజ్‌కు నాలుగైదు రోజుల ముందే అనుమ‌తులు వ‌చ్చాయి. మూడు రోజుల ముందే బుకింగ్స్ కూడా మొద‌ల‌య్యాయి. అక్క‌డంతా సాఫీగా సాగిపోతోంది.

కానీ తెలంగాణ‌లో మాత్రం వెయిటింగ్ గేమ్ కొన‌సాగుతోంది. బుధ‌వారం రాత్రి పెయిడ్ ప్రిమియ‌ర్స్ ప‌డాల్సి ఉండ‌గా.. 24 గంట‌ల ముందు కూడా టికెట్ల రేట్లు పెంపు జీవో రాలేదు. పెంపు మీద ఆశ‌లు పెట్టుకోకుండా నార్మ‌ల్ రేట్ల‌తో టికెట్ల అమ్మ‌కాలు మూడు రోజుల ముందే మొద‌లుపెట్టి ఉంటే.. ఈపాటికి సేల్స్ ఒక రేంజిలో ఉండేవి.

ఈ ఎదురు చూపుల వ‌ల్ల బుకింగ్స్‌లో విప‌రీత‌మైన ఆల‌స్యం జ‌రిగి తీవ్ర న‌ష్టం జ‌రిగే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.ఈ ద‌శ‌లో రేట్ల పెంపు ఉన్నా ప్ర‌యోజ‌నం ఏమాత్రం ఉంటుందో అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. ఒక‌వేళ రేట్ల పెంపే లేక‌పోతే మాత్రం కోల్పోయే ఆదాయం పెద్ద మొత్తంలో ఉంటుంద‌నే అంచ‌నాలున్నాయి.

This post was last modified on June 2, 2026 10:47 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

5 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

5 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

5 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

5 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

7 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

9 hours ago