Movie News

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిజ జీవిత భార్యా భర్తలయ్యాక రిలీజవుతున్న మొదటి మూవీగా అభిమానులు చాలా స్పెషల్ గా ఫీలవుతున్నారు. దానికి తగ్గట్టే ఈ జంట ప్రమోషన్ వీడియోలలో తమ బంధం ఎంత బలంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బడ్జెట్ దృష్ట్యా దీనికి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే ప్రచారం హఠాత్తుగా మొదలయ్యింది.

దీనికి మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ ఎలాంటి హైక్స్ ఉండవని, రెగ్యులర్ ధరలకే గొప్ప అనుభూతిని పొందవచ్చని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చారు. అంటే తెలంగాణ మల్టీప్లెక్సులో గరిష్టంగా 295, ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా 177 రూపాయలకు ఈ సినిమాని చూసేయొచ్చు. సింగల్ స్క్రీన్లలో మరింత అందుబాటులో రేట్లు ఉంటాయి. ఇలాంటి స్ట్రాటజీ ఎంత మేలు చేస్తుందో ఆల్రెడీ ఇరుముడి నాలుగు వారాలుగా ఋజువు చేయడం చూస్తున్నాం.

స్వాతంత్రం రాక ముందు రాయలసీమలోని ఒక కరువు ప్రాంతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ కథను రాసుకున్నారు. టీజర్ లో కంటెంట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ శాంపిల్ చూపించారు. అసలు సినిమాలో విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఊహకందని స్థాయిలో ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. అజయ్ అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఫ్రెష్ గా ఇంటెన్స్ గా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చెబుతున్నారు.

ఆదర్శ కుటుంబం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రణబాలికి ఉన్న ఏకైక కాంపిటీషన్ జైలర్ 2 ఒకటే. ఒకవేళ ఆ సినిమా కనక టికెట్ రేట్ల పెంపుకి మొగ్గు చూపితే అది విజయ్ దేవరకొండకు అడ్వాంటేజ్ అవుతుంది. రెగ్యులర్ ధరలు ఉంటాయి కాబట్టి ఆడియన్స్ ప్రాధాన్యత రణబాలికే ఎక్కువ ఉండొచ్చు. టాక్ పాజిటివ్ గా వస్తే మటుకు కలెక్షన్ల మోత భారీగా ఉంటుంది. ప్యారడైజ్ నిరాశపరిచిన నేపథ్యంలో సరైన మాస్ సినిమా కోసం బాక్సాఫిస్ మంచి ఆకలితో ఎదురు చూస్తోంది.

This post was last modified on October 5, 2026 2:44 am

Share

Recent Posts

పార్టీలో అసమ్మతి పెరుగుతోంది జగన్!!

స్థానిక ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ర్వాత‌.. వైసీపీలో మ‌రింత‌గా స‌హాయ నిరాక‌ర‌ణ పెరిగిందా? నాయ‌కుల తీరు మారుతోందా? అంటే.. ఔననే స‌మాధాన‌మే…

54 minutes ago

కోటి రూపాయ‌లు ప‌లికిన `స‌ర్పంచ్` ప‌ద‌వి!

ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. మూడు విడ‌త‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.…

3 hours ago

‘జగనన్నా… భారతి గారిని రాజకీయాల్లోకి తీసుకురండి’

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా అంటే వాతావరణం అలాగే కనిపిస్తుంది. ఇప్పటి…

3 hours ago

నాగ్ చెప్ప‌డం కాదు… చేసి చూపిస్తున్నాడు

చెప్పిన డేటుకి షూటింగ్ పూర్తి చేయ‌రు. రిలీజ్ డేట్ మళ్లీ మ‌ళ్లీ మార్చాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఫైన‌ల్ డేట్ ద‌గ్గ‌ర…

4 hours ago

వాష్‌ రూమ్‌ విషయంలోనూ ఏఐ గోల తప్పట్లేదు

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనుషుల జీవితాలు సులభతరం కావాలి. కానీ కొన్ని సంస్థల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.…

8 hours ago

‘రాహుల్ వెనుక మేము పరిగెడితే వారికెందుకు బాధ’

దేశంలో మొదటిసారి హైదరాబాద్ లో శనివారం గిగ్ వర్కర్ల సంక్షేమ సభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ…

10 hours ago