Movie News

ఇవి క్లిక్ అయితే… నారా హీరో ఫుల్ బిజీనే

ఏమాత్రం సినీ నేపథ్యం లేని నారా కుటుంబం నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రోహిత్. నారా అంటే పక్కా పొలిటికల్ ఫ్యామిలీ అనే గుర్తింపు ఉండగా.. రోహిత్ మాత్రం సినీ రంగాన్ని ఎంచుకున్నాడు. తొలి చిత్రం ‘బాణం’తోనే తన ప్రతిభను చాటుకున్న అతను.. ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలతో మంచి గుర్తింపే సంపాదించాడు. కానీ కొన్నేళ్లు ఫుల్ బిజీగా ఉన్న అతను.. సడెన్‌గా ఇండస్ట్రీ నుంచి మాయం అయిపోయాడు.

తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక అతను కనిపించకుండా పోవడంతో పొలిటికల్ బ్యాకప్‌తోనే అతను సినిమాలు చేయగలుగుతున్నాడనే అభిప్రాయాలు వినిపించాయి. అందుకు తగ్గట్లే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోహిత్ సినిమాల్లో యాక్టివ్ అయ్యాడు. గత ఏడాది ‘సుందరకాండ’ అనే చిత్రంతో పలకరించిన రోహిత్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఇటీవలే చినిమల్లి మణికుమార్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమాను మొదలుపెట్టాడు రోహిత్.

ఐతే హీరోగా మున్ముందు ఎన్ని సినిమాలు చేస్తాడో కానీ.. రోహిత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో రోహిత్ ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అది పాజిటివ్ క్యారెక్టరా.. నెగెటివా అన్నది వెల్లడి కాలేదు.

ఇంతలోనే ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమాలో స్పెషల్ రోల్‌కు రోహిత్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి రూపొందించబోతున్న చిత్రంలో రోహిత్‌ కోసం ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట.

చిరు సినమాలో నారా రోహిత్ నటించడం ప్రేక్షకులకు కచ్చితంగా ఒక సర్ప్రైజే. రోహిత్ గతంలోనూ ‘సారొచ్చారు’ లాంటి చిత్రాల్లో క్యామియో రోల్స్ చేశాడు కానీ.. వెంకీ, చిరు లాంటి పెద్ద హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేయడం తన కెరీర్‌లో కచ్చితంగా ఒక మలుపే. ఈ పాత్రలు క్లిక్ అయితే క్యారెక్టర్, విలన్ పాత్రలతో అతను బిజీ అయిపోయే అవకాశముంది.

This post was last modified on May 31, 2026 3:07 pm

Share

Recent Posts

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

56 minutes ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

3 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

4 hours ago

వెంకటేష్ చెంప మీద ఎందుకు కొట్టుకున్నాడు

దర్శకుడు యాక్షన్ చెప్పాక.. యాక్టర్ డైలాగ్ మరిచిపోతే ఏమవుతుంది? కట్ చెప్పి మళ్లీ ఆ సీన్ తీస్తారు కదా. ‘ఆదర్శ…

4 hours ago