Movie News

రామ్ చరణ్ చేతిలో 7 చీలికలు

తన సినిమాల్లో పాత్రల కోసం శారీరకంగా ఎంత కష్టానికైనా వెనుకాడని కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ధృవ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల కోసం అతనెంత శ్రమించాడో, ఎంత అద్భుతంగా లుక్‌ను మార్చుకున్నాడో తెలిసిందే. ఇప్పుడు తన నుంచి రాబోయే ‘పెద్ది’ కోసం కూడా ఎంత కష్టపడ్డాడో ప్రోమోల్లో కనిపిస్తోంది.

ముఖ్యంగా ఇందులో కుస్తీ యోధుడి పాత్ర కోసం చరణ్ ఒళ్లు హూనం చేసుకునేలా కష్టపడ్డాడని, గాయాల పాలు కూడా అయ్యాడని టీం అంతా చెబుతోంది. కుస్తీ పోటీల సన్నివేశాల్లో భాగంగానే చేతిని దెబ్బ తీసుకుని రిస్ట్ బేస్‌తో కనిపిస్తున్నాడు. దాంతోనే ప్రమోషన్లలో కనిపిస్తున్నాడు.

‘పెద్ది’ షూటింగ్‌లో భాగంగా చెయ్యి బాగా దెబ్బ తిందని, దానికి సర్జరీ కూడా అవసరమని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో సమాచారాన్ని పంచుకున్నాడు చరణ్.

‘పెద్ది’లో కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలను 30 రోజుల పాటు చిత్రీకరించామని, ఆ సమయంలో మొదట్లోనే కొంచెం నొప్పి అనిపించిందని.. కానీ చేతికి ఏమైందో తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ స్కాన్ తీసి చూసుకునేందుకు తనకు భయం వేసిందని.. ఒక వేళ చీలిక (టియర్) ఉంటే షూట్ కొనసాగించలేం కదా అనిపించిందని చరణ్ చెప్పాడు.

ఐతే మొదట్లో ఒక చిన్న చీలిక వచ్చి ఉంటుందని అనుకుంటే.. షూటింగ్ అంతా అయ్యాక స్కాన్ చూసుకుంటే ఏకంగా 7 చోట్ల చీలికలు ఉన్నట్లు తెలిసిందని చరణ్ తెలిపాడు. చేతికి సర్జరీ అవసరం అయిందని, కానీ ఇప్పుడు శస్త్రచికిత్స చేసుకుంటే ప్రమోషన్లకు దూరం కావాల్సి ఉంటుందని, అందుకే బ్రేస్ వేసుకుని మేనేజ్ చేస్తున్నానని.. సినిమా విడుదల తర్వాత సర్జరీ చేయించుకుంటానని చరణ్ తెలిపాడు. కుస్తీ పోటీల్లో రెజ్లర్లు చేతులు పట్టుకునే ఒకరినొకరు నెట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ రెజ్లర్లతో కలిసి సాధన చేయడం, చిత్రీకరణలో పాల్గొనడంతో చరణ్‌ చేతికి బాగానే గాయాలైనట్లు కనిపిస్తోంది.

This post was last modified on May 31, 2026 4:03 pm

Share

Recent Posts

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

1 hour ago

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

2 hours ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

2 hours ago

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

3 hours ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

5 hours ago

జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…

5 hours ago