Movie News

డిజాస్టర్ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌ను దాటేస్తున్నాడు

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించిన హీరో రావడం అసాధ్యం అనుకున్నారంతా. ఒకప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆ స్థాయిలో ఉండేవి. ఆయన సినిమాలకు పోటీనే ఉండేది కాదు. రజినీ ఫ్లాప్ సినిమాల కలెక్షన్లను వేరే స్టార్ల హిట్ సినిమాలు దాటలేకపోయేవి. అలాంటి హీరోను విజయ్ అధిగమించి తమిళంలో నంబర్ వన్ హీరో కావడం అసామాన్య విషయం. గత దశాబ్ద కాలంలో విజయ్ ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు. అదే సమయంలో రజినీ డౌన్ అయ్యాడు.

లియో, వారిసు, ది గోట్ లాంటి సాధారణ చిత్రాలతో కూడా భారీ వసూళ్లు రాబట్టడం విజయ్‌కే చెల్లింది. ఇప్పుడు తన చివరి చిత్రం ‘జననాయగన్’తోనూ అతను అద్భుతాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు తొలి రోజు ఎంత బ్యాడ్ టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. అయినా సరే.. ఈ సినిమా తొలి వీకెండ్లో భారీ వసూళ్లు సాధించింది. వీక్ డేస్‌లో కూడా వసూళ్లు పర్వాలేదు. ఇతర భాషల్లో ప్రభావం చూపకపోయినా.. తమిళంలో మాత్రం ‘జననాయకుడు’కు ఢోకా లేదు.

ఇప్పటికే ‘జననాయగన్’ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.250 కోట్ల మార్కుకు చేరువగా ఉండడం విశేషం. ఈ వీకెండ్లో కూడా తమిళంలో చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. కాబట్టి ఈ సినిమా రన్ ఇంకొన్ని రోజులు కొనసాగేలా ఉంది. కాబట్టి ఫుల్ రన్లో రూ.300 కోట్ల మార్కును కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదు. విశేషం ఏంటంటే.. తమిళంలో విజయ్‌కు చాలా ఏళ్లు సమవుజ్జీగా ఉన్న అజిత్.. గత ఏడాది తన బ్లాక్ బస్టర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో సాధించిన వసూళ్లు రూ.250 కోట్ల లోపే.

అలాంటి సినిమాను డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న చిత్రంతో విజయ్ దాటేస్తున్నాడు. విజయ్ మార్కెట్ స్టామినా ఎలాంటిది అనడానికి ఇదే రుజువు. కానీ ఇలాంటి తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కెరీర్ పతాక స్థాయిలో ఉండగా సినిమాలకు గుడ్ బై చెప్పేయడమే అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది. కానీ అదే సమయంలో ఆయన రాజకీయాల్లో సూపర్ హిట్ అయి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వారికి మరో రకంగా సంతోషాన్నిస్తోంది. ‘భగవంత్ కేసరి’ నుంచి మెయిన్ ప్లాట్ తీసుకుని మార్పులు చేర్పులతో హెచ్.వినోద్ రూపొందించిన ‘జననాయగన్’ను వెంకట్.కె.నారాయణ నిర్మించారు.

This post was last modified on July 29, 2026 10:59 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

29 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

36 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

41 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

1 hour ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago