Movie News

సైలెంటుగా సినిమా చేస్తున్న క్రిష్

తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. తొలి సినిమా ‘గమ్యం’తో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని అతను తనవైపు తిప్పుకున్నాడు. రొటీన్ మాస్ మసాలా సినిమాల చుట్టూ టాలీవుడ్ తిరుగుతున్న టైంలో ఇలాంటి గొప్ప సినిమా రావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ దర్శకుడికి పెద్ద ఎత్తున అభిమానులు తయారయ్యారు. రెండో సినిమా ‘వేదం’ కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా.. దాంతోనూ దర్శకుడిగా తన అభిరుచిని చాటాడు క్రిష్.

ఆపై కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలతో క్రిష్ దర్శకుడిగా తన స్థాయిని చాటాడు. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో దర్శకుడిగా పతాక స్థాయిని అందుకున్న ఆయనకు.. ఆ తర్వాత ఏదీ కలిసి రాలేదు. బాలీవుడ్లో చేసిన ‘మణికర్ణిక’ మధ్యలో ఆయన చేజారింది. ఆపై తెలుగులో తీసిన యన్.టి.ఆర్, కొండపొలం చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. గత ఏడాది ‘ఘాటి’తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తే అది ఆయన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

‘ఘాటి’ రిలీజ్ తర్వాత క్రిష్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఆయన కొత్త సినిమా గురించి అసలే కబురూ వినిపించలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం క్రిష్ సైలెంటుగా ఒక సినిమా చేస్తున్నాడట. ఈసారి కెరీర్లో ఎన్నడూ చేయని ప్రయోగం చేస్తున్నాడట క్రిష్. అందరూ కొత్త వాళ్లతో ఒక రోడ్ ట్రిప్ మూవీ చేస్తున్నాడట క్రిష్. కెరీర్లో లో బడ్జెట్ సినిమాలు, స్టార్లు కాని వాళ్లతో ట్రై చేశాడు కానీ.. పూర్తిగా కొత్త వాళ్లతో ఈ దర్శకుడు సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం ఆయన ఈశాన్య ప్రాంత నేపథ్యాన్ని తీసుకున్నాడట. అక్కడే చిత్రీకరణ జరుగుతోంది.

ఎప్పట్లాగే సొంత బేనర్ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’లోనే ఈ సినిమా కూడా చేస్తున్నట్లున్నాడు క్రిష్. ‘ఘాటి’తో భారీ నష్టాలు వచ్చినప్పటికీ ఎక్కువ టైం తీసుకోకుండా తన సంస్థలో ఇంకో సినిమా చేయడం విశేషమే. ఈసారైనా క్రిష్ దర్శకుడిగా తన స్థాయికి తగ్గ సినిమా తీసి, కమర్షియల్‌గానూ మంచి ఫలితం అందుకుంటే చూడాలన్నది అభిమానుల కోరిక. మొత్తం సినిమా పూర్తి చేశాకే దాని వివరాలు వెల్లడించాలనుకుంటున్నాడట క్రిష్.

This post was last modified on May 29, 2026 6:21 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago