Movie News

చందమామ గ్లామర్ ఎటాక్.. పట్టించుకుంటారా?

టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ విజయ్, అజిత్, సూర్య లాంటి టాప్ స్టార్లతో నటించింది. మరోవైపు హిందీలోనూ కొన్ని పెద్ద సినిమాల్లో నటించింది. ఐతే ఒక కథానాయిక కెరీర్లో ఎంత పీక్స్ చూసినా.. వయసు పెరిగి, గ్లామర్ తగ్గుముఖం పట్టాక అవకాశాలు తగ్గడం మామూలే.

కాజల్ విషయంలోనూ అదే జరిగింది. పెద్ద హీరోల సరసన అవకాశాలు తగ్గుతున్న టైంలోనే ఆమె పెళ్లి కూడా చేసుకోవడంతో కెరీర్ మరింత డౌన్ అయింది. అదే సమయంలో సీత, సత్యభామ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఆమె అడుగులు వేసింది. కెరీర్లో కొంచెం గ్యాప్ వచ్చాక ‘భగవంత్ కేసరి’ సినిమాలో నందమూరి బాలకృష్ణతో జట్టు కట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఆ సినిమా బాగా ఆడినా.. కాజల్‌కు మంచి పేరేమీ రాలేదు. దీంతో ఇంకో పెద్ద సినిమా అవకాశం రాలేదు.

ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తున్న చందమామకు సౌత్‌లో మాత్రం అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. ఇలాంటి టైంలో కాజల్ ఫిజిక్ మీద బాగా శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో తన లేటెస్ట్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు బాగా తిరుగుతున్నాయి. ఇందులో కాజల్ చాలా సన్నబడి కనిపిస్తోంది. తన ముఖంలో కూడా కొంచెం మార్పు కనిపిస్తోంది.

గ్లామర్ మీద బాగా శ్రద్ధ పెట్టి శరీరాకృతిని కాజల్ మార్చుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతే కాక పెళ్లి తర్వాత చేసిన మోస్ట్ గ్లామరస్ ఫొటో షూట్లలో ఇదొకటని చెప్పొచ్చు. మళ్లీ తాను గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అని ఆమె సంకేతాలు పంపుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఒకసారి పక్కన పెట్టిన కథానాయికలను మళ్లీ పెద్ద సినిమాల్లోకి తీసుకోవడం కష్టమే. మరి కాజల్ ఆశలు ఫలిస్తాయా.. ఆమెకు తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలేమైనా వస్తాయా అన్నది చూడాలి.

This post was last modified on May 29, 2026 10:07 pm

Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

1 hour ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago