Movie News

ఎగ్జిబిటర్లకు పెరుగుతున్న మద్దతు?

తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానాన్ని కోరుతూ ఎగ్జిబిటర్లు చేస్తున్న పోరాటం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిందే. ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్లు ఈ విషయంలో చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. తాత్కాలికంగా ఏదో ఒక హామీ ఇచ్చి సమస్యను వాయిదా వేస్తే ఊరుకోమని.. వెంటనే పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాల్సిందే అని.. రాబోయే పెద్ద సినిమా ‘పెద్ది’కి కూడా మినహాయింపు ఉండదని తేల్చి చెబుతున్నారు.

ఐతే కొన్ని వారాల ముందు ఎగ్జిబిటర్లు తమ బాధను వ్యక్తం చేస్తూ.. వారి మీద కౌంటర్ ఎటాక్ చేశారు నిర్మాతలు. సింగిల్ స్క్రీన్ల మెయింటైనెన్స్ గురించి విమర్శలు చేయడం, నిర్మాతల బాధలు చెప్పుకోవడం, ‘పెద్ది’ సినిమాను టార్గెట్ చేయడానికే ఇలా చేస్తున్నారనడం ద్వారా ఈ వ్యవహారంలో పైచేయి సాధించాలని చూశారు. తర్వాత సమస్య పరిష్కారం కోసం ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు.. సినీ పెద్దలు కలిసి కూర్చుని మాట్లాడుకోవడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగినట్లే కనిపించింది.

కానీ చర్చలు, కమిటీల నివేదికల ద్వారా తమకు న్యాయం జరిగేలా లేదని.. ఇదంతా సమస్యను నాన్చే ప్రయత్నంలా ఉందని అనుమానిస్తున్న ఎగ్జిబిటర్లు మళ్లీ పోరాటం మొదలుపెట్టారు. తమ బాధను ఇండస్ట్రీ వాళ్లకే కాక మీడియాకు, సామాన్య జనాలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక సినిమా మల్టీప్లెక్సులో కోటి రూపాయల షేర్ సాధిస్తే పర్సంటేజీ ప్రకారం అందులో రూ.45 లక్షలు థియేటర్ యజమానికి, రూ.55 లక్షలు నిర్మాతకు వెళ్తున్నాయని.. కానీ సింగిల్ స్క్రీన్లో అంతే ఆదాయం వస్తే అద్దె రూపంలో రూ.7 లక్షలు మాత్రమే థియేటర్ యజమానికి ఇచ్చి, రూ.93 లక్షలు నిర్మాత తీసుకుంటున్నారనే కఠిన వాస్తవాన్ని ఎగ్జిబిటర్లు మీడియా ద్వారా బయటపెట్టి అన్ని వర్గాల నుంచి సానుభూతి సంపాదిస్తున్నారు. తాజాగా ఎగ్జిబిటర్ల కష్టాలపై నందమూరి బాలకృష్ణ సైతం సింపతీ చూపించారు.

‘పెద్ది’ సినిమాను ముందుంచి తమను ఇరుకున పెట్టాలని నిర్మాతలు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు నేరుగా మెగాస్టార్ చిరంజీవినే కలుస్తున్నారు. ఆయనకు సమస్య అర్థమయ్యేలా చెప్పి మద్దతు సంపాదిస్తే.. తమ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. ఎలాగూ సామాన్య జనం, సోషల్ మీడియా నుంచి కూడా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో పర్సంటేజీకి నిర్మాతలు ఒప్పుకోక తప్పదని ఎగ్జిబిటర్లు ఆశిస్తున్నారు.

This post was last modified on May 25, 2026 2:37 pm

Share

Recent Posts

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

2 hours ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

2 hours ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

2 hours ago

అమరావతికి మహర్దశ… బాబు ప్రయత్నం ఫలిస్తుంది!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప్రాధ‌మిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిల‌ను సీఎం చంద్ర‌బాబు తాజాగా…

2 hours ago

ఫ్లాప్ సినిమా సీక్వెల్… అయినా క్రేజ్ ఉంది

ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…

3 hours ago

నాగవంశీకి ఈసారి అలాంటి ఇబ్బంది లేదు

కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…

3 hours ago