Movie News

బాలయ్య & మోహన్ లాల్ కలయిక సాధ్యమే

కొన్ని ఆన్ స్క్రీన్ కాంబినేషన్లు చూడాలని మూవీ లవర్స్ కోరుకుంటారు కానీ అవి అరుదుగా జరుగుతాయి. జైలర్ రూపంలో అది కొంత మేర తీరింది కానీ పూర్తి స్థాయిలో కాదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ జట్టు కట్టించడం ద్వారా రాజమౌళి ఒక కొత్త సంప్రదాయానికి దారి చూపించినా అలాంటి కథలు రాసేవాళ్ళు, తీసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన కాంబోకి టాలీవుడ్ లో శ్రీకారం చుడుతున్నట్టు తాజాగా వినిపిస్తున్న సమాచారం.

బాలకృష్ణ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టుకి కార్యాచరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఉంటుందో లేదోననే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జరుగుతోంది కానీ ఎట్టి పరిస్థితుల్లో, కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా సెట్స్ కు వెళ్లడం ఖాయంగా చెబుతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ కథలో రెండు పవర్ ఫుల్ పాత్రలు ఉంటాయట. ముందు బాలయ్య డ్యూయల్ రోల్ అనుకుని ఇప్పుడు మరో సీనియర్ హీరోతో దాన్ని మార్చే విధంగా వివేక్ ఆత్రేయ మార్పులు చేశారని తెలిసింది.

ఇప్పుడా రెండో క్యారెక్టర్ కోసమే మోహన్ లాల్ ని ట్రై చేస్తున్నట్టు తెలిసింది. పాత్ర నచ్చితే తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆయన వెనుకాడరు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో చూశాం. మనమంతా సినిమాని కేవలం కంటెంట్ నచ్చి ఓకే చేశారు. తమిళంలో విజయ్ జిల్లాని ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. సో సరైన రీతిలో కన్విన్స్ చేయగలిగితే లాలెట్టన్ ని సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ దిశగానే వివేక్ ఆత్రేయ ట్రయిల్స్ లో ఉన్నారట.

అప్పుడెప్పుడో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం బాలయ్య నటించిన గాండీవం సినిమాలో మోహన్ లాల్ ఒక పాటలో చిన్న క్యామియో చేశారు. సందర్భం ప్రత్యేకంగా లేకపోయినా దర్శకుడు ప్రియదర్శన్ తో ఉన్న అనుబంధం కారణంగా ఎస్ చెప్పారు. ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత ఒక ఫుల్ లెన్త్ రోల్ లో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటే కనక రెండు సింహాల మధ్య ఆన్ స్క్రీన్ యుద్ధం చూసినట్టు ఉంటుంది. అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి.

This post was last modified on May 23, 2026 9:00 pm

Share

Recent Posts

లోకల్ ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీ తప్పదా?

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. త్వరలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీంతో ప్రధాన…

2 hours ago

దారులన్నీ మూసుకున్నాయి దానం!

తనపై అనర్హత వేటు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీం కోర్టులో సవాల్…

3 hours ago

ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు ఇక అధికారికం..!

సోష‌ల్ మీడియాలైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా గ్రామ్ వంటి వాటిలో వీడియోలు, రీల్స్ చేసి.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌ను అధికారికంగా…

4 hours ago

సూపర్ స్టార్ కోసం ‘సార్’ త్యాగం

బాక్సాఫీస్ వద్ద పోటీకి సంబంధించి రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దసరా పండగ టార్గెట్ గా ఈసారి క్రేజీ సినిమాలు…

4 hours ago

కొడాలి వార‌సుడికి వ‌ర్క‌వుట్ అయ్యేలా లేదే.. !

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సవాలుగా మారింది. రాజకీయంగా ఆయ‌న త‌న త‌మ్ముడి కొడుకును…

5 hours ago

బాలయ్య ఆరాకి ఉన్న క్రేజ్ అలాంటిది

కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల ప్రభావం కేవలం ఒకటి రెండు భాషలకు పరిమితం కాదు. ఒక్కోసారి దేశాలు దాటిపోతుంది. వాటిలో…

5 hours ago