పెద్ది ప్రమోషన్స్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగరంలో జరిగిన ఈవెంట్ లో సాంగ్ లాంచ్ తో పాటు ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ జరిగింది. చెప్పిన టైం కన్నా రెండు మూడు గంటలు ఆలస్యంగా ప్రోగ్రాం మొదలుపెట్టినప్పటికీ భారీగా వచ్చిన ప్రేక్షకులు ఓపికగా ఎదురు చూడటం గమనార్హం. లక్షకు పైగా కెపాసిటీ ఉన్న గ్రౌండ్ దాదాపుగా ఫుల్ అయిపోయింది. ఒక నాన్ హిందీ హీరో నటించిన సినిమాకు ఈ స్థాయిలో స్పందన రావడం అరుదని చెప్పాలి.
ఊహించినట్టే స్టేజి మీద రెహమాన్ అదరగొట్టేశారు. తను కంపోజ్ చేసిన పాటలను హిందీ పల్లవితో మొదలుపెట్టి తెలుగు చరణాలతో ముగించడం బాగా పేలింది. ఐటెం సాంగ్ లైవ్ లోనే ఆకట్టుకునేలా ఉండటంతో లిరికల్ రూపంలో ఇయర్ ఫోన్ తో వింటే చార్ట్ బస్టర్ ఖాయమనేలా ఉంది. హైలైట్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ భోపాల్ ప్రజలను ఉద్దేశించి బీహార్ అనడం, క్రికెటర్ల పేర్లు ప్రస్తావిస్తూ బుమ్రాని ఫుట్ బల్ ప్లేయర్ అన్నట్టు రిపీట్ చేయడం నవ్వులు పూయించింది.
రవికిషన్ పెద్ది గురించి ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చేశారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయని, చరణ్ కు జాతీయ అవార్డులు ఖాయమని చెప్పేశారు. జాన్వీ కపూర్, నిర్మాత వెంకట సతీష్ కిలారు తదితరులు కంటెంట్ గురించి పొగడ్తల వర్షం కురిపించారు. ముంబై ట్రైలర్ లాంచ్ లో యాంకరే ఇక్కడా వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి జోష్ తీసుకొచ్చారు. సుమారు నాలుగు కోట్ల బడ్జెట్ తో నిర్వహించిన ఈ వేడుక కోరుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యింది
రెహమాన్ ప్రసంగంలో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, కష్టపడిన విధానం, డాన్సుల రూపంలో తన సాంగ్స్ కి వేల్యూ జోడించడం ఇవన్నీ పూసగుచ్చినట్టు వివరించారు. ఆద్యంతం జోష్ ఫుల్ గా జరిగిన వేడుకలో ఇంకొందరు క్యాస్టింగ్ రాలేదు కానీ హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ లో వాళ్ళను కలుసుకోవచ్చు. మొత్తానికి ఊహించిన దానికన్నా చాలా పెద్ద క్రౌడ్ భోపాల్ లో కనిపించడం మెగా ఫ్యాన్స్ ని ఆనందలో ముంచెత్తింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తయ్యింది.
This post was last modified on May 24, 2026 9:47 am
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…