ఇండియన్ సినిమా హిస్టరీలోనే గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన ఏఆర్ రెహమాన్.. ఇంతకుముందులా మెరుపులు మెరిపించలేకపోతున్నాడని ఆయన అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొన్నేళ్లుగా. సంగీత దర్శకుడిగా పరిచయం అయి మూడు దశాబ్దాలు దాటినప్పటికీ.. ఇంకా ఖాళీగా లేకుండా వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ ముందులా ఆయన సంగీతం ఉర్రూతలూగించట్లేదనే విమర్శలున్నాయి.
ఐతే ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ‘చికిరి’ పాటతో ఆయన హోల్ ఇండియాను షేక్ చేశారు. ‘పెద్ది’ సినిమాలోని ఆ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ చిత్రం నుంచి వచ్చిన రెండో పాట ‘రై రై రారా’ కూడా బాగానే ఆకట్టుకుంది. కానీ ఇటీవల రిలీజ్ చేసిన ‘పెద్ది’ ట్రైలర్లో మాత్రం రెహమాన్ నిరాశపరిచాడనే కామెంట్లు సర్వత్రా వినిపించాయి. ట్రైలర్ అనుకున్నంత కిక్ ఇవ్వకపోవడంలో రెహమాన్ బీజీఎం కూడా ఒక కారణం అనే చర్చ జరిగింది.
ఐతే కేవలం ట్రైలర్‌ను చూసి రెహమాన్‌ను తక్కువ అంచనా వెయ్యడం కరెక్ట్ కాదు. రెహమాన్‌ది చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లలా గ్యాలరీ ప్లేయింగ్ స్టైల్ కాదు. విపరీతమైన శబ్ద కాలుష్యంతో హోరెత్తించరు. సన్నివేశానికి తగ్గట్లుగా నేపథ్య సంగీతం సమకూరుస్తారు. టీజర్లు, ట్రైలర్లలో సిగ్నేచర్ మూమెంట్స్ కనిపించడం తక్కువ.
అయినా ‘పెద్ది’ ట్రైలర్లో బుచ్చిబాబు చిన్న చిన్న మూమెంట్స్ చాలా చూపించారు కానీ.. లెంగ్తీ షాట్స్ తక్కువ. కాబట్టి సినిమాలో సందర్భానుసారం బీజీఎం పరంగా ఆయన తన మార్కు చూపించి ఉంటానడంలో సందేహం లేదు. చాన్నాళ్ల తర్వాత రెహమాన్‌కు ఇది పాన్ ఇండియా స్థాయిలో తనేంటో రుజువు చేసుకోవడానికి అవకాశం ఉన్న సినిమా. కాబట్టి ఇటు పాటలు, అటు నేపథ్య సంగీతంతో ఆయన తన మార్కును చూపిస్తాడనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates