అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియా ఫాన్స్కి రుచించలేదు. కానీ ట్రేడ్‍లో మాత్రం ఈ చిత్రానికి ఇప్పుడు సూపర్ క్రేజు. రానా దగ్గుబాటిని రెండవ హీరోగా ఖరారు చేయడంతో ఈ చిత్రాన్ని బాహుబలికి తక్కువేం కాదని ట్రేడ్ చెబుతోంది. ప్రభాస్‍తో రానా కలిస్తే బాహుబలి అయినపుడు, ఇక్కడ అదే హీరో పవన్‍తో కలిసి నటిస్తే అంతే రేంజ్ వుంటుందనేది ట్రేడ్ అంచనా. అయితే ఇక్కడ దర్శకుడిగా రాజమౌళి లేడనేది విస్మరించరాదు.
అయితే ఆ లోటుని కాస్తయినా భర్తీ చేయడానికి త్రివిక్రమ్ బ్రాండింగ్ హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలతో పాటు స్క్రీన్‍ప్లే కూడా రాస్తోన్న త్రివిక్రమ్ కేవలం దర్శకత్వం మాత్రం చేయడం లేదు కానీ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తాడని, ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటాడని టాక్ వుంది.
సాగర్ చంద్రలాంటి పేరు తెలియని దర్శకుడిని పెట్టినా కానీ అది కేవలం బడ్జెట్ కంట్రోల్ కోసమేనని, త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంబంధించి అన్నిటిపైన కాల్ తీసుకుంటాడని, పవన్ కళ్యాణ్ కూడా ఆ మాట మీదే ఈ చిత్రం చేయడానికి అంగీకరించాడని సమాచారం. మరి ట్రేడ్ మినీ సైజ్ బాహుబలిగా చూస్తోన్న ఈ చిత్రం అది సాధించిన వసూళ్లలో ఎంతమేరకు రాబడుతుందనేది ఆసక్తికరం.
This post was last modified on December 30, 2020 9:17 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…