హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు ఉద్దేశం ఏదైనా ట్రైలర్ కట్ సరిగ్గా జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడే జడ్జ్ చేయలేం కానీ పెద్ద హీరోల మూవీస్ కి అన్నం మెతుకు రుచిలాగా వీటిని బట్టే ఓపెనింగ్స్ హెచ్చు తగ్గులుంటాయి.
ఇదిలా ఉంచితే శనివారం భోపాల్ లో భారీ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. ఏఆర్ రెహమాన్ ప్రత్యక్షంగా ఇందులో పాటలను పాడి అలరించబోతున్నారు. 50 ఎకరాల చోటులో అతి పెద్ద సౌండ్ ఎక్క్విప్మెంట్ ఏర్పాటు చేయబోతున్నారు. దీని ఖరీదు అక్షరాల 150 కోట్లట. అంటే కొనలేదు లెండి. ఒక రోజు అద్దె కోటి రూపాయలు చెల్లించి తీసుకున్నారని సమాచారం. భేల్ దసరా మైదానంగా పేరొందిన గ్రౌండ్ లో చాలా పెద్ద సీటింగ్ కెపాసిటీ ఉంది.
రేపటి నుంచి పాసులు ఉచితంగా ఇవ్వబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు వీర ఫ్యాన్స్ వెళ్తున్నారని సమాచారం. భోపాల్ వేడుక చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంగీతం విషయంలో రెహమాన్ ఖచ్చితంగా సంతృప్తి పరుస్తారనే హామీని ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైలర్ బీజీఎమ్ ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ ఆయనకు చేరే ఉంటాయి. ఫైనల్ కాపీ రీ రికార్డింగ్ మరింత బెటర్ గా ఉండాలని ఫ్యాన్స్ కోరిక.
గతంలో చరణ్ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న అనుభవం ఉంది కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంత గ్రాండ్ గా ఏ వేడుక చేయలేదు. ఇది కనక సక్సెస్ అయితే నార్త్ ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఓపెనింగ్స్ తేవడంలో ఈ ఈవెంట్ కీలకం కానుంది. రెహమాన్ కూడా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన టీమ్ భోపాల్ చేరుకుని ముందస్తు మ్యూజిక్ సెట్టింగ్ ఏర్పాట్లు చూసుకుంటోందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates