Movie News

వంద కోట్లు దాటించిన సూర్య ఇమేజ్

ఇటీవలే విడుదలైన వీరభద్రుడు / కరుప్పు ఊహించని వీకెండ్ నమోదు చేసింది. ట్రేడ్ టాక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూటా పాతిక కోట్ల దాకా గ్రాస్ వసూలైనట్టు సమాచారం. సూర్య గత పదమూడు సంవత్సరాల్లో ఈ నెంబర్ చూడలేదు. సింగం 2 తర్వాత ఇంత పెద్ద సక్సెస్ లేకపోవడమే దీనికి కారణం. తమిళనాడులో గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా తెలుగు వెర్షన్ సైతం తొంబై వేలు దాటడం విశేషం. ఇవి పెద్ద నెంబర్లు.

నిజానికి వీరభద్రుడుకి యునానిమస్ టాక్ రాలేదు. మిక్స్డ్, నెగటివ్, పాజిటివ్ అన్నీ వినిపించాయి. అయితే చాలా కాలం తెలుగు తమిళ బాక్సాఫీస్ కు సరైన మాస్ సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు. దీంతో అందరూ ఆకలి మీద ఉన్న తరహాలో వీరభద్రుడుకి వెళ్లిపోయారు. అందులోనూ తమిళ పేరుని పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా శుభ్రంగా తెలుగు దేవుడి పేరు టైటిల్ గా పెట్టడం బిసి సెంటర్స్ లో చాలా ప్లస్ అయ్యిందని బయ్యర్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ రోజు నుంచి కరుప్పు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది కీలకంగా మారింది. ఒరిజినల్ వెర్షన్ కు ఢోకా లేదు. అక్కడి జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. ఏపీ తెలంగాణ ప్రేక్షకులకు ఇది తప్ప మరో మాస్ ఆప్షన్ లేకపోవడం కలిసి వచ్చింది. రెండో వారంలో ఉన్న గోదారి గట్టుపైన ఒక వర్గానికే పరిమితం కావడంతో మాస్ జనాలు సూర్యకే ఓటు వేశారు. ఇది శివ కార్తికేయన్ లాంటి హీరో చేసుంటే ఏమయ్యేదో కానీ సూర్య ఇమేజ్ పెద్ద రక్షణ కవచమైన మాట వాస్తవం.

అలాని సూర్య సినిమాలన్నీ ఇలాగే వర్కౌట్ అవుతాయని కాదు. తన మీద మినిమమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఏ కథ అయినా కాసులు కురిపిస్తుందని సూర్య ప్రూవ్ చేశాడు. దీన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన వాళ్ళు రెట్రో, కంగువ లాంటి డిజాస్టర్లు ఇచ్చారు. ఆర్జె బాలాజీ దర్శకత్వం కన్నా సూర్య యాక్టింగ్, క్లైమాక్స్ లో విశ్వరూపం గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టే సూర్యకు దక్షిణాది మూడు భాషల్లో బలమైన ఫాలోయింగ్ ఉందని అర్థమవుతోంది. వాడుకోవడం డైరెక్టర్ల చేతిలో ఉంది.

This post was last modified on May 18, 2026 11:21 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago