Movie News

రామ్ కంటే ముందు ఎవ‌రు?

టాలీవుడ్లో హీరోలు ద‌ర్శ‌కులవ‌డం కొత్త కాదు కానీ.. ఈ జాబితా మ‌రీ పెద్ద‌దేమీ కాదు. తాజాగా యువ క‌థానాయ‌కుడు రామ్ పోతినేని ద‌ర్శ‌కుడిగా మారిన సంగ‌తి తెలిసిందే. త‌నే హీరోగా ఒక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్లో న‌టిస్తున్నాడు రామ్. ఈ చిత్రాన్ని రామ్ సోద‌రుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్.. వీర అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. టాలీవుడ్లో ద‌ర్శ‌క‌త్వం నుంచి న‌ట‌న వైపు వ‌చ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు కానీ.. హీరోలు ద‌ర్శ‌కుల‌వ్వ‌డం మాత్రం ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే జ‌రుగుతోంది.

ఇప్పుడున్న హీరోల్లో రామ్ కంటే ముందు ఈ సాహ‌సం చేసింది విశ్వ‌క్సేన్ మాత్ర‌మే. అత‌ను కెరీర్ ఆరంభంలోనే ఫ‌ల‌క్‌నుమా దాస్ తీశాడు. త‌ర్వాత ధ‌మ్కీ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్పుడు క‌ల్ట్ అనే సినిమా తీస్తున్నాడు. అడివి శేష్ ఒకేసారి ద‌ర్శ‌కుడిగా, హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. క‌ర్మ సినిమా తీశాడు. త‌ర్వాత త‌నే హీరోగా కిస్ అనే సినిమా తీశాడు. ఐతే ముందు హీరోగా ప‌రిచ‌యం అయి.. త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారిన జాబితాలో అత‌నుండ‌డు.

ఇక ముందు త‌రంలో ద‌ర్శ‌క‌త్వం చేప‌ట్టిన స్టార్ హీరోల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించాలి. ఆయ‌న జానీ సినిమా తీసిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత స‌త్యాగ్ర‌హి అనే మ‌రో సినిమా కూడా తీయాల‌నుకున్నాడుడ కానీ.. కుద‌ర‌లేదు. ప‌వ‌న్ కంటే ముందు త‌రంలో లెజెండ‌రీ న‌టులు ఎన్టీ రామారావు, కృష్ణ‌లిద్ద‌రూ ద‌ర్శ‌క‌త్వం చేప‌ట్టారు.

ఎన్టీఆర్ దానవీర శూర క‌ర్ణ స‌హా ప‌ది సినిమాల‌కు పైగానే తీశారు. అందులో అయిదు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు అయ్యాయి. ఇక సూప‌ర్ స్టార్ కృష్ణ సైతం ద‌ర్శ‌కుడిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. ఆయ‌న ఖాతాలో సింహాస‌నం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఉంది.

ఇలా టాలీవుడ్లో ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేసిన హీరోల సంఖ్య చాలా త‌క్కువే. హీరోయిన్ల‌లో భానుమ‌తి రామ‌కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల త‌దిత‌రులు ద‌ర్శ‌కులుగా మంచి స్థాయిని అందుకున్నారు. ఇక హీరోలు కాకుండా న‌ట‌న నుంచి ద‌ర్శ‌కులైన వాళ్ల జాబితా పెద్ద‌దే. ర‌విబాబు, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు ఈ జాబితాలో క‌నిపిస్తారు.

This post was last modified on May 16, 2026 3:08 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

5 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

55 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago