Movie News

చేతులు మారిన ర‌వితేజ సినిమా?

చాలా కాలంగా స‌రైన విజ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ.. మాస్ రాజా ర‌వితేజకు అవ‌కాశాల విష‌యంలో లోటేమీ లేదు. ఇంత‌కుముందులా మాస్ చిత్రాల‌కు ప‌రిమితం కాకుండా భిన్నమైన సినిమాలు చేసేందుకు రెడీ కావ‌డం, అదే స‌మ‌యంలో పారితోష‌కం కూడా త‌గ్గించుకోవ‌డంతో మాస్ రాజాతో సినిమాలు చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉత్సాహంగా ముందుకు వ‌స్తున్నారు. ఈ నెల‌లోనే ఇరుముడి చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్న ర‌వితేజ‌.. హాసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణుతో క‌లిసి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

మ‌రోవైపు విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌త ఓ సినిమా చేయ‌డానికి కూడా ర‌వితేజ ప‌చ్చ జెండా ఊపాడు. ఇరుముడి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేక‌ర్సే ఈ మూవీని కూడా నిర్మించాల్సింది. కానీ ఏమైందో ఏమో.. ఇప్పుడు ఆ అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంద‌ట‌. ఈ సినిమా వేరే నిర్మాత చేతుల్లోకి వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఒక‌ప్పుడు దిల్ రాజు సంస్థ‌లో వ‌చ్చిన అనేక చిత్రాల‌కు శిరీష్‌తో క‌లిసి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ల‌క్ష్మ‌ణ్ గుర్తున్నాడా?  కార‌ణాలేంటో కానీ.. త‌ర్వాత ఆయ‌న ఆ సంస్థ‌కు దూరం అయ్యాడు. 

డిస్ట్రిబ్యూష‌న్లో ఉన్న‌ప్ప‌టికీ.. ల‌క్ష్మ‌ణ్ ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా క‌నిపించింది లేదు. ఆయ‌న ఇప్పుడు నిర్మాత‌గా మారుతున్నాడ‌ట. మైత్రీ సంస్థ వ‌దిలేసిన ర‌వితేజ‌, వివేక్ ఆత్రేయ సినిమాను ల‌క్ష్మ‌ణే ప్రొడ్యూస్ చేయ‌నున్నాడ‌ట‌. ఇది కాస్త ఎక్కువ బ‌డ్జెట్లోనే తెర‌కెక్కే సినిమా అంటున్నారు. ఇలాంటి ప్రాజెక్టును ల‌క్ష్మ‌ణ్ టేక‌ప్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌మే. అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తె కానీ సరైన స్పష్టత రాదు. త్వ‌ర‌లోనే ఈ మూవీ గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఇరుముడి ఈ నెల 21న రిలీజ్ కానుండ‌గా.. ర‌వితేజ‌, శ్రీ విష్ణు మూవీని కుదిరితే సంక్రాంతికి, లేదంటే వేస‌వికి రిలీజ్ చేయ‌నున్నారు.

This post was last modified on August 12, 2026 10:45 am

Share

Recent Posts

ఎన్నికలకు ముందు లైట్లు… ఓడిపోయాక తొలిగింపు

రాజస్థాన్ కావొచ్చు... ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఇంకే రాష్ట్రమైనా కావొచ్చు. స్థానిక ఎన్నికలంటేనే చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు…

4 minutes ago

ఈసారి కోటి ఓట్లు.. 90 సీట్లు.. ఇదే రేవంత్ టార్గెట్

మరో రెండు సంవత్సరాల్లో తెలంగాణా సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొందరికి…

9 minutes ago

ఏంటీ… బిస్లరీ వాటర్ సురక్షితం కాదా??

బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే వెంటనే వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తాం. అయితే చాలామంది మాత్రం బ్రాండ్ ఏదైనా సరే…

1 hour ago

బిసి సెంటర్స్‌లో ‘రిపీట్’ కావడం లేదా

మొన్న శుక్రవారం విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ అంచనాలకు మించి హైదరాబాద్, ఓవర్సీస్ లో అదరగొడుతోంది. వసూళ్లు ఊహించిన…

11 hours ago

ఓమ్‌లో ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయో

టాక్ మిశ్రమంగా ఉన్నా ఓమ్ వసూళ్లు బాగున్నాయి. వీకెండ్ తర్వాత ఎంత శాతం డ్రాప్ ఉంటుందనేది రెండు రోజులు ఆగితే…

12 hours ago

భోగి మంటల్లో శత్రువుల దహనం

టాలీవుడ్ తెరమీద రక్తధారలు కొనసాగుతున్నాయి. హీరోలు మారుతున్నా వయొలెన్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కాసులు కురిపించే దిశగా ప్రేక్షకులు ముందుకు…

12 hours ago