Political News

చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ ఎదుట లొంగిపోయిన భగీరథ్ ను పోలీసులు మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.

మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో భగీరథ్ పై ఫేట్ బహీరాబాద్ పోలీసులు పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు భగీరథ్ కు నోటీసులు జారీ చేశారు.

అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదని వాదించిన భగీరథ్, ఆయన కుటుంబ సభ్యులు కేసుకు సంబంధించిన పలు వివరాలను న్యాయవాదుల ఎదుట పెట్టి కేసును సమగ్రంగా పరిశీలించారు. ఈ క్రమంలో పోలీసు విచారణకు హాజరయ్యే విషయంలో భగీరథ్ ఒకింత జాప్యం చేశారు.

అయితే కేసు తీవ్రమైనదైనా పోలీసుల విచారణకు భగీరథ్ హాజరు కాని నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నట్టుగా పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా పోలీసుల నోటీసుల గడువు ముగిసి వారం రోజులు కావస్తున్న నేపథ్యంలో భగీరథ్ శనివారం రాత్రి లొంగిపోయారు.

ఈ సందర్భంగా ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు భగీరథ్ ను రెండు గంటల పాటు విచారించారు. అనంతరం ఆయనకు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత న్యాయమర్తి ఎదుట హాజరుపరిచారు.

This post was last modified on May 17, 2026 8:33 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

4 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

5 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

5 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

6 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

6 hours ago