కరోనా సమయంలో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. కలీన్ భాయ్, అతని కొడుకుతో పాటు మరో ఇద్దరు యువకులు చేసే విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన తీరు జనాన్ని కట్టిపడేసింది. అయితే బూతులు, హింస, శృంగారం విచ్చలవిడిగా జొప్పించడం విమర్శలను తీసుకొచ్చింది కానీ సక్సెస్ ని ఆపలేకపోయింది. రెండో సీజన్ పర్వాలేదనిపించుకుంటే మూడో భాగంలో మునుపటి మేజిక్ రిపీట్ కాలేక యావరేజ్ దగ్గర ఆగిపోయింది.
ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ మీర్జాపూర్ సినిమాగా సెప్టెంబర్ 4 థియేటర్లలో వస్తోంది. హిందీ తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేశారు. అయితే సిరీస్ కు దీనికి పాత్రల పరంగా పోలిక ఉంటుంది తప్పించి పూర్తిగా కొత్త కథను రాసుకున్నారు. చనిపోయిన క్యారెక్టర్లు ఇందులో మళ్ళీ బ్రతికాయి. పంకజ్ త్రిపాఠికి శత్రువుగా రవి కిషన్ ని తీసుకొచ్చి మరింత ఇంటెన్సిటీ జోడించారు. ట్రైలర్ లోనే బూతు డైలాగులు, బోల్డ్ గా రెచ్చిపోయిన సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి.
సెన్సార్ బోర్డు ఇందులో ఎన్ని అభ్యంతరాలు చెబుతుందో, ఎన్ని కట్స్ ఇస్తుందో చూడాలి. వెబ్ సిరీస్ కు నియంత్రణ ఉండదు కాబట్టి ఏం చేసినా చెల్లింది. కానీ సినిమాలకు అలా కుదరదు. అయినా సరే మీర్జాపూర్ నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు. ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఒకటే. టీవీలో ఎంత ఎంజాయ్ చేసినా ఇలాంటి ఓవర్ వయొలెంట్ కంటెంట్ ని టికెట్లు కొని జనం చూస్తారాని. దురంధర్, యానిమల్, పుష్పలో చూశాం కదాని కొందరు కామెంట్ చేయొచ్చు.
కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా చూడాల్సిన విషయం ఏమిటంటే బుల్లితెరకు అలవాటు పడిన ఇలాంటి సిరీస్ లు సినిమాగా మారితే ఆడియన్స్ ని రప్పించడం అంత సులభం కాదు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న మీర్జాపూర్ వాళ్ళను నమ్ముకునే థియేటర్ బిజినెస్ చేస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి రారు గాక రారు. ఒకవేళ కల్ట్ మేకింగ్ పేరుతో టీమ్ దీన్ని ఎంత రుద్దాలని చూసినా అసలు సినిమాలో బలముంటేనే ఆడుతుంది. అందులో డౌట్ లేదు. అయితే మీర్జాపూర్ మూవీలో ఎన్ని హద్దులు దాటారనేదే అందరూ వేస్తున్న క్వశ్చన్. సమాధానం దొరకాలంటే ఇరవై రోజులు ఆగాలి.
This post was last modified on August 12, 2026 11:39 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…