మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పెద్ది మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొన్ని నెలలుగా డ్రై రన్ నడుస్తున్న సమయంలో ఈ సినిమా రిలీజవుతుండడంతో దీని కోసం ఇటు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. చిత్ర బృందంలోని ఒక్కొక్కరు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్ మీడియాను కలిసి విశేషాలను పంచుకున్నారు. ఇప్పుడు ఏకంగా దర్శకుడు బుచ్చిబాబే రంగంలోకి దిగాడు. తన ఇంటర్వ్యూలు సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేస్తున్నాయి. సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను అతను వెల్లడిస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెద్ది పాత్రకు స్ఫూర్తి తన ఊరికి చెందిన కుర్రాడే అంటూ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడు బుచ్చిబాబు.
బుచ్చిబాబు ఊరిలో పెద్ది రాజు అనే కుర్రాడు ఉండేవాడట. అతను కూలి పనికి వెళ్లేవాడట. ఐతే అతను క్రికెట్, వాలీబాల్ సూపర్‌గా ఆడేవాడని.. పని మాన్పించి మరీ అతడితో మ్యాచ్‌లు ఆడించేవాళ్లమని.. అందుకోసం డబ్బులు కూడా ఇచ్చేవాళ్లమని బుచ్చిబాబు వెల్లడించాడు. అతను ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించేవాడని.. తనను చూసినపుడల్లా ఈ క్యారెక్టర్ భలే ఉందే అనిపించేదని.. తన స్ఫూర్తితోనే పెద్ది పాత్రను క్రియేట్ చేసి, ఈ కథ రాశానని బుచ్చిబాబు వెల్లడించాడు.
తన గురువు సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఒక గుడిలో కూర్చుని ఈ కథ పూర్తి చేశానని.. ఈ కథకు రామ్ చరణ్ ఏ కరెక్షన్ చెప్పకుండా ఒప్పుకోవాలని అక్కడ మొక్కుకున్నానని.. తాను కోరుకున్నట్లే చరణ్ ఏ చిన్న మార్పు చెప్పకుండా ఈ కథను ఓకే చేశాడని బుచ్చిబాబు తెలిపాడు. ఇక సినిమాలో రామ్ చరణ్ బెల్లం ఫ్యాక్టరీలో పని చేసే కుర్రాడిగా కనిపిస్తాడని.. తన పెర్ఫామెన్స్ వేరే లెవెల్లో ఉంటుందని.. మళ్లీ అతను ఇలాంటి కథలో నటించడం కష్టమని, తాను కూడా ఇంత మంచి కథ రాయలేనని బుచ్చిబాబు చెప్పడం విశేషం.
This post was last modified on May 16, 2026 11:00 pm
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…