Movie News

త్రిష పోస్టు ఎవరినుద్దేశించి?

ఈ మధ్య తమిళ సీనియర్ హీరోయిన్ త్రిష పెద్దగా సినిమాలు చేస్తున్నట్లు కనిపించట్లేదు. అయినా ఆమె పేరు మాత్రం నిత్యం మీడియాలో నానుతూనే ఉంటోంది. ఆమె కొన్నేళ్లుగా విజయ్‌తో కలిసి ఉంటోందన్న వార్త కొన్ని నెలలుగా ప్రచారంలో ఉంది. తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ విషయం ఎంత పెద్ద చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇద్దరూ కలిసి బయటి రావడంతో అనుమానాలు మరింత పెరిగాయి.

విజయ్ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యాక త్రిష మీద ఫోకస్ మరింత పెరిగింది. ఆమె ఎక్కడ కనిపించినా.. ఏం మాట్లాడినా.. ఏ సోషల్ మీడియా పోస్టు పెట్టినా.. అందరి దృష్టీ అటు మళ్లుతోంది. విజయ్‌కి ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా వార్తే, చెప్పకపోయినా వార్తే. అప్పుడప్పుడూ త్రిష పెట్టే క్రిప్టిక్ సోషల్ మీడియా పోస్టులు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా అలాంటి పోస్టే ఒకటి పెట్టిందామె.

‘‘ఈ వయసులో డ్రామాలు చేయడం నిజంగా సిగ్గుచేటు, పోయి నాలుగు రాళ్లు సంపాదించుకుని ప్రశాంతంగా బతకండి’.. ఇదీ త్రిష ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న కోట్ సారాంశం. ఇది విజయ్ భార్య సంగీతను ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలైంది. విజయ్ కొన్నేళ్లుగా సంగీత నుంచి దూరంగా ఉంటుండగా.. త్రిషతో అతడి సంబంధం నేపథ్యంలో ఎన్నికల ముంగిట భర్త నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన మీద అనేక ఆరోపణలు కూడా చేశారు.

ఇక వీళ్లిద్దరూ అధికారికంగా విడిపోవడం లాంఛనమే అనుకుంటుండగా.. ఇటీవల సంగీత విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయ్, సంగీతలను కలిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇది త్రిషకు నచ్చకే ఈ పోస్టు పెట్టిందా అనేే చర్చ జరుగుతోంది. ఆమె ఉద్దేశం ఏదైనప్పటికీ.. ఈ పోస్టు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

This post was last modified on August 12, 2026 10:18 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago