చాలా కాలంగా ఫామ్ లో లేని అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ కావడం లేదని భావించి రకరకాల జానర్లు ట్రై చేశాడు. సీరియస్ గా ‘బచ్చల మల్లి’ చేస్తే జనాలు బాబోయ్ అని దండం పెట్టేశారు. పోనీ ట్రెండ్ ఫాలో అవుదామని హారర్ కాన్సెప్ట్ తో ’12 ఏ రైల్వేకాలనీ’ తీస్తే ఆడియన్స్ దాని దరిదాపుల్లోకి వెళ్ళలేదు. మెసేజ్ ఇద్దామని ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, రివెంజ్ చూపిద్దామని ‘ఉగ్రమ్’ ట్రై చేస్తే అన్నీ పోయాయి. నా సామి రంగా హిట్టయినా ఆ క్రెడిట్ నాగార్జున అకౌంటులోకి వెళ్ళిపోయింది.
వచ్చే నెల అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’తో వస్తున్నాడు. నిన్న టీజర్ లాంచ్ జరిగింది. కథేంటో చెప్పేశారు. ఒక మేజిక్ బుక్కు ద్వారా ఇంద్రలోకంలో ఉన్న రంభ ఊర్వశి మేనకలను భూలోకానికి రప్పిస్తాడు హీరో. ఆ తర్వాత జరిగే సంఘటనలు, ఇంద్రుడిగా నటించిన వెన్నెల కిషోర్ తో చేయించే విన్యాసాలు, మొత్తంగా లాజిక్స్ కి దూరంగా మేజిక్ కి దగ్గరగా వెళ్ళాడు దర్శకుడు చంద్రమోహన్ చింతల. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషాలు దేవకన్యలుగా అందాలు ఒలకబోస్తున్నారు.
నిజానికి ఈ పాయింట్ కొత్త కాదు. ఎప్పుడో ముప్పై అయిదు సంవత్సరాల క్రితం రాజేంద్రప్రసాద్ హీరోగా రంభ రాంబాబు వచ్చింది. పెద్ద ఫ్లాప్. జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఇంద్రుడి కూతురుని భూమికి రప్పిస్తే రికార్డులు తిరగరాసింది. ఇలా ఒకరిద్దరు ఎందుకని ఇప్పుడు రంభ ఊర్వశి మేనకలను అల్లరి నరేష్ కోసం కిందకు దించుతున్నారు. మాయలు చేసే పుస్తకం కాన్సెప్ట్ మనం ఎస్వి కృష్ణారెడ్డి యమలీలలో చూసిందే. అందుకే అల్లరోడి మూవీలో దానికి వేరే ట్విస్టు పెట్టారు.
ఇప్పుడు జెన్ జీ ప్రేక్షకులను నవ్వించడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, చిరంజీవి కాలంలో రంభ ఊర్వశి మేనకల మీద విపరీతమైన క్రేజ్ ఉండేది కానీ కొత్త జనరేషన్ కు వాళ్ళ గురించి కనీస అవగాహన లేదు. అలాంటి బ్యాక్ డ్రాప్ తీసుకున్న దర్శకుడు చంద్రమోహన్ పూర్తిగా వినోదాన్ని నమ్ముకున్నారు. అందుకే ఇంద్రుడిని కూడా కామెడీ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సెప్టెంబర్ 4 ఈ సినిమా థియేటర్లకు రానుంది. చూడాలి మరి అల్లరోడికి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో.
This post was last modified on August 12, 2026 10:52 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…