మలయాళం బ్లాక్ బస్టర్ తుడరమ్ దర్శకుడు తరుణ్ మూర్తి ఇటీవలే చిరంజీవిని కలుసుకోవడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. తుడరమ్ రీమేక్ కోసమే పిలిపించారనే ప్రచారం మొదలయ్యింది. అయితే తరుణ్ వాటిని కొట్టేస్తున్నారు. తనను ప్రత్యేకంగా ప్రశంసించడానికే మెగాస్టార్ పిలిచారని, ఇది తన జీవితంలో గొప్ప రోజుగా మిగిలిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. అసలు రీమేక్ ఛాన్స్ ఒక్క శాతం కూడా లేదని చెప్పడానికి బలమైన కారణాలున్నాయి.
ఇంతకు ముందు మోహన్ లాల్ లూసిఫర్ ని ఏరికోరి మరీ రీమేక్ చేయించుకున్నారు చిరంజీవి. దానికి ముగ్గురు నలుగురు దర్శకులు కథా చర్చల్లో పాల్గొన్నాక ఫైనల్ గా మోహన్ రాజా లాక్ అయ్యారు. ఇంతా చేసి సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మక్కికి మక్కి తీయడం ఒక మైనస్ అయితే ఆల్రెడీ లూసిఫర్ డబ్బింగ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో ఉండగా మళ్ళీ దాన్నే రీమేక్ చేయడం దెబ్బ కొట్టింది. మళ్ళీ ఇతర బాషల కథలు వద్దనుకునేలా అదో మినీ షాక్ ఇచ్చింది.
ఇప్పుడు తుడరమ్ కూడా అదే బాపతే. తెలుగులో థియేటర్ రిలీజ్ అయ్యింది. ఓటిటిలో అందుబాటులో ఉంది. పొరపాటున కూడా చిరంజీవి అలా ఆలోచించే అవకాశమే లేదు. ఆయన ప్రాధాన్యత కేవలం స్ట్రెయిట్ స్టోరీస్ మీదే ఉంది. అందుకే రెండేళ్లు గ్యాప్ వచ్చినా పర్లేదు అనుకుని మన శంకరవరప్రసాద్ గారు చేశారు. సూపర్ రిజల్ట్ వచ్చింది. విశ్వంభర అంత బడ్జెట్ డిమాండ్ చేసినా అది ఫ్రెష్ సబ్జెక్టు. దర్శకుడు బాబీ తెరకెక్కించే మూవీ స్వంతంగా రాసుకున్నది.
శ్రీకాంత్ ఓదెల గురించి చెప్పాల్సిన పని లేదు. తన అభిమాన హీరో కోసం ఏ రేంజ్ వయొలెంట్ సబ్జెక్టు రెడీ చేస్తాడో ఊహించుకోవడం కష్టం. సో మెగాస్టార్ ఇకపై రీమేకులకు దూరంగా ఉండబోవడం వాస్తవం. పైగా రెండేళ్లకు సరిపడా డైరీని బిజీగా ఉంచేసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఫ్యాన్స్ మెదళ్లను ఎప్పటికప్పుడు తొలుస్తున్న ప్రశ్న విశ్వంభర విడుదల ఒకటే. దానికి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో, ఎప్పుడు థియేటర్లలో వదులుతారో అంతు చిక్కడం లేదు.
This post was last modified on May 10, 2026 10:31 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…