Political News

మోదీకి మరిచిపోలేని ఆతిథ్యమిచ్చిన చంద్రబాబు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి తన హైదరాబాద్ పర్యటనలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీని విశిష్ట అతిథిగా పరిగణించిన చంద్రబాబు కుటుంబం మోదీకి మచిరిపోలేని అతిథ్యం ఇచ్చింది. బాబు ఫ్యామిలీ అందించిన ఆతిథ్యంతో మోదీ కూడా మంత్రముగ్ధులయ్యారని చెప్పక తప్పదు. ఎందుకంటే…ఓ వైపు తాను ఎంతగానో ఇష్టపడే యువ రాజకీయవేత్త నారా లోకేశ్, మరోవైపు దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త చంద్రబాబు.. ఇద్దరూ కలిసి తనకు ఇచ్చిన ఆతిథ్యం మోదీకి మెమరబుల్ గానే నిలిచిందని చెప్పాలి.

తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటుగా బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాలుపంచుకునేందుకు ఆదివారం మోదీ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ తమ ఇంటికి రావడంతో బాబు ఫ్యామిలీ… మోదీని విశిష్ట అతిథిగా పరిగణించింది. ఈ సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వంటకాలను తయారు చేయించిన బాబు ఫ్యామిలీ మోదీకి పసందైన విందును అందించింది.

చంద్రబాబు, లోకేశ్ లు ఇచ్చిన విందుతో మైమరచిన మోదీ దాని నుంచి తేరుకునేలోపే… మరో స్పెషల్ ఆయన ముందు ప్రత్యక్షమైంది. తమ ఇంటికి వస్తున్న మోదీకి అరుదైన బహుమతిని తయారు చేయించిన బాబు ఫ్యామిలీ.. దానిని మోదీ చేతిలో పెట్టింది.

ఈ బహుమతి ఏమిటన్న విషయానికి వస్తే… వెంకటగిరి చేనేత కళాకారులు రూపొందించిన తిరుమల శ్రీవేంకటేశ్వరుడి చిత్రపటాన్ని బాబు ఫ్యామిలీ మోదీకి అందించింది. ఈ చిత్రపటం ప్రత్యేకత ఏమిటంటే.. ఈ చిత్రపటంపై శ్రీవారిని కీర్తించే శ్లోకం ఉంది. అంతేకాదండోయ్… ఈ చిత్రపటం తయారీకి ప్రత్యేకమైన జామ్దారీ నేతను వినియోగించారట. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ, ఆధ్యాత్మిక, చేనేత కళా వైభవానికి గుర్తుగా బాబు ఫ్యామిలీ ఈ చిత్రపటాన్ని మోదీకి అందజేసిందట.

కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తో మోదీ అత్యంత స్నేహపూర్వకంగా మెలగుతున్న సంగతి తెలిసిందే. మోదీ అమరావతి వచ్చినా, లోకేశ్ ఢిల్లీ వెళ్లినా…వీరిద్దరి కలయిక అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

అలాంటిది తమ ఇంటికి మోదీ రావడంతో లోకేశ్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి మోదీకి గుర్తుండిపోయే ఆతిథ్యం ఇచ్చారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో పాటుగా నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి కుమారుడు నారా దేవాన్ష్.. అందరూ కలిసి మోదీకి చిత్రపటాన్ని అందించారు.

This post was last modified on May 10, 2026 10:37 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

38 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago