Movie News

నానిలో ఈ టాలెంట్ కూడా ఉందా

ఇప్పటి హీరోల్లో వచ్చామా నటించామా వెళ్లిపోయామా అనుకునే వాళ్లు తక్కువమంది. కథా చర్చల్లో భాగమవుతున్నారు. స్క్రిప్టులు రాస్తున్నారు. దర్శకత్వం కూడా చేస్తున్నారు. కొందరు సినిమాకు సంబంధించి ప్రతి దశలోనూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఐతే నేచురల్ స్టార్ నాని తన సినిమాల్లో రైటింగ్ సహా దేనికీ ఇప్పటిదాకా క్రెడిట్ తీసుకోలేదు కానీ.. అతను కథా చర్చల్లో తన వంతు పాత్ర పోషిస్తుంటాడని.. డైలాగులను ఆన్ సెట్ ఇంప్రొవైజ్ చేస్తుంటాడని తనతో కలిసి పని చేసిన వాళ్లు చెబుతుంటారు.

నాని కెరీర్లో కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న ‘నిన్ను కోరి’ సినిమాకు సంబంధించి నానికి ఒక మేజర్ క్రెడిటే ఉందట. ఆ సినిమాకు టైటిల్ పెట్టిందే నానినట. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ వెల్లడించాడు. ‘నిన్ను కోరి’ ఇటీవలే రీ రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్లో కొత్త సినిమాలను మించి ఇది సందడి చేస్తోంది. థియేటర్లలో సంబరాలు గట్టిగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో శివ నిర్వాణ ఒక ఇంటర్వ్యూలో ‘నిన్ను కోరి’ విశేషాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో పేర్లు పడేటపుడు వచ్చే టైటిల్ సాంగ్‌ను శివనే రాశాడు. ఇది ఎలా జరిగిందో వివరిస్తూ.. ‘నిన్ను కోరి’ టైటిల్ పెట్టింది నాని అని వెల్లడించాడు శివ.

ఇంకా టైటిల్ ఖరారు చేయని సమయంలో నాని ఒక రోజు ఫోన్ చేసి, నేనొక టైటిల్ చెప్తా, వెంటనే అదెలా ఉందో నువ్వు చెప్పాలి అన్నాడని.. అతను ‘నిన్ను కోరి’ అనే టైటిల్ చెప్పగానే అద్భుతంగా ఉంది, కథకు బాగా సూటవుతుంది అని చెప్పి దాన్నే ఫైనలైజ్ చేశానని చెప్పాడు శివ.

ఇక టైటిల్స్ పడేటపుడు ‘నిన్ను కోరి’ అంటూ ఒక చిన్న బిట్ సాంగ్ వస్తే బాగుంటుందని రీ రికార్డింగ్ చేసేటపుడు సంగీత దర్శకుడు గోపి సుందర్‌‌కు చెబితే, మరి లిరిక్స్ ఎలా అని అడిగాడని.. అప్పటికప్పుడు తాను పావు గంటలో నాలుగైదు లైన్లు రాసి ఇచ్చానని.. వాటితోనే గోపి బ్యూటిఫుల్ సాంగ్ చేశాడని శివ నిర్వాణ వెల్లడించాడు.

2017లో వచ్చిన ‘నిన్ను కోరి’ అప్పట్లో మంచి విజయం సాధించడమే కాక.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. శివ ప్రస్తుతం రవితేజతో ‘ఇరుముడి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on May 10, 2026 12:14 am

Share

Recent Posts

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

50 minutes ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

1 hour ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

1 hour ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

2 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

2 hours ago

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…

3 hours ago