Political News

నవశకం… విజయ్ అనే నేను!

తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీ.జోసెఫ్ విజయ్ అను నాను.. అంటూ విజయ్ చెప్పగానే స్టేడియం అంతా కేరింతలతో మార్మోగిపోయింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో టీవీకే అధినేత విజయ్ తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు ఈ ఈవెంట్ లో సినీనటి త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అభిమాన నటుడు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వేలాదిమంది అభిమానులు టీవీకే కార్యకర్తలు తరలివచ్చారు.

విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పంచెకట్టులో కాకుండా సూట్ లో వచ్చారు. విజయ్ తో పాటు మొత్తం 9 మంది టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు మంత్రులుగా ఈరోజే ప్రమాణ స్వీకారం చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది.

కానీ, మంత్రివర్గ విస్తరణలో మిత్ర పక్షాలకు అవకాశం ఇవ్వాలని విజయ్ భావించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

This post was last modified on May 10, 2026 10:48 am

Share

Recent Posts

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

2 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

3 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

3 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

3 hours ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

4 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

4 hours ago