Political News

ఇది కదా ‘విజయో’త్సవం అంటే

తమిళేనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్న స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అదినేత జోసెఫ్ విజయ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చెన్నై నగరంలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న వేదిక మీద తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఆదివారం విజయ్ ప్రయాణం చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ వేదిక మీదే గతంలో విజయ్ కి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. నాడు స్టేడియం చివరి వరుసలో కూర్చున్న విజయ్… నేడు అదే స్టేడియంలో సీఎంగా ప్రమాణం చేస్తున్నారంటూ వారు ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు.

విజయ్ తమిళ సినీ రంగంలో ఓ తిరుగులేని స్టార్ గా ఎదిగారు. సీనియర్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ తదితరుల పోటీని తట్టుకుని కూడా విజయ్ తనకంటూ ఓ ప్రత్యేక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోగలిగారు. అదే సమయంలో తమిళ స్టార్ హీరోలందరికంటే కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగానూ ఆయన రికార్డులకెక్కారు. ఆపై తమిళ సినీ రంగంతో పాటు ఇతరత్రా భాషల్లోనూ విజయ్ రాణించారు. సినిమాల్లో విజయ్ ఎక్కడ కాలు పెట్టినా… అక్కడ విజయమే అన్నట్లుగా ఆయన సినీ ప్రస్థానం సాగింది.

తమిళ సినిమా రంగానికి సంబంధించి గతంలో వందేళ్ల సినిమా పేరిట ఇదే నెహ్రూ స్టేడియంలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ సినీ రంగానికి చెందిన దాదాపుగా అందరు నటులూ హాజరయ్యారు. వారి మాదిరే విజయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో టాప్ హీరో అయినప్పటికీ విజయ్ కి నిర్వాహకులు చివరి వరుసలో సీటు ఇచ్చారు. ఇలా చేసి నిర్వాహకులు విజయ్ ని నిజంగానే అవమానించారని చెప్పక తప్పదు. అయితే విజయ్ ఇదేమీ పట్టించుకోకుండా తనకు కేటాయించిన సీటులో కూర్చుండిపోయారు.

నాడు సినిమా కార్యక్రమంలో చివరి వరుసలో కూర్చుండిపోయిన అదే నెహ్రూ స్టేడియంలో ఇప్పుడు విజయ్ సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. శనివారం రాత్రికే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినట్లుగా సమాచారం. ఈ కార్యక్రమం కేవలం విజయ్ కోసమే జరుగుతుండటం గమనార్హం.

ఒకప్పుడు తనకు అవమానం జరిగిన చోటే… ఇఫ్పుడు సీఎంగా విజయ్ ప్రయాణ స్వీకారం చేస్తున్న వైనాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. జీవితం అంటే అదే మరి. ఏదైనా పనిని భుజానికెత్తుకున్నప్పుడు అందులో విజయం సాధించే దిశగా పకడ్బందీగా అడుగులు వేసే విజయ్ లాంటి వారి విషయంలో ఇది సర్వసాధారణమైనదని చెప్పక తప్పదు.

This post was last modified on May 10, 2026 8:44 am

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

1 hour ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

2 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago