Movie News

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న డ్రామాలో పావుగా మారిన విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నారు. గెలుస్తానో లేదో తెలియక ముందే ఇదే తన చివరి మూవీగా ప్రకటించుకున్న విజయ్ ఇక మేకప్ ఎప్పటికీ వేసుకోకపోవచ్చు. పూర్తిగా ప్రజా జీవితానికి అంకితం కాబోతున్నారు.

ఇక ఇప్పుడు విజయ్ అభిమానులు జన నాయకుడుకి థియేటర్లలో ఓ రేంజ్ లో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎంజీఆర్, జయలలితలు సిఎం అయ్యాక వాళ్ళు నటించిన కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ అనుకోకుండా విజయ్ కు ఆ అదృష్టం దక్కింది. ఇప్పుడు టీవీకె పార్టీ వర్గాలు, ఇతర పార్టీల్లో ఉన్న విజయ్ ఫ్యాన్స్ అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఆ రోజు తమిళనాడు మొత్తం థియేటర్లలో ఈ ఒక్క సినిమానే ప్రదర్శించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇప్పటికి ట్రేడ్ వర్గాల్లో ఉన్న డిస్కషన్ ప్రకారం మే 27 విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది. కేవలం పెద్ది రావడానికి వారం ముందు అంటే కొంచెం రిస్క్ అయినప్పటికీ జన నాయకుడు వరకు తమిళనాడులోనే ఎక్కువగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇతర బాషల మీద భారీ ఆశలు పెట్టుకోవడానికి లేదు. భగవంత్ కేసరి రీమేక్ కావడంతో ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున స్వాగతం దక్కుతుందని అనుకోవడానికి లేదు. మన రెగ్యులర్ ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపకపోవచ్చు.

ఇదంతా ఓకే కానీ జన నాయకుడు దృష్టి సారించాల్సిన మరో ముఖ్యమైన సమస్య ఉంది. రిలీజ్ కు ముందే హెచ్డి ప్రింట్ వచ్చిన సంగతి తెలిసిందే. నిర్మాణ సంస్థ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని సాధ్యమైనంత మేర అరికట్టింది కానీ రేపు థియేటర్లకు వచ్చాక దాన్ని మళ్ళీ బయటికి తీస్తారు. అప్పుడు కట్టడి చేయడం చాలా కష్టం. అయినా సరే ఓపెనింగ్స్, కలెక్షన్స్, రికార్డుల విషయంలో జన నాయగన్ కోలీవుడ్ లో కొత్త సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

This post was last modified on May 9, 2026 10:58 pm

Share

Recent Posts

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

1 hour ago

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

4 hours ago

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

5 hours ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

5 hours ago

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

6 hours ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

8 hours ago