Movie News

వీరభద్రుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై వర్గాల్లో బలంగా జరిగింది. విజయ్ సిఎం కావడం మీద రాజకీయ, జన, మీడియా వర్గాలన్నీ దృష్టి పెట్టడంతో సినిమాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫ్లాప్ అయినా సరే ధనుష్ కర ఈ కారణంగానే వసూళ్ళలో పెద్ద కోత చూడాల్సి వచ్చింది. నిన్న మూడోసారి విజయ్ గవర్నర్ ను కలిశాక ఇక అంతా సద్దుమణిగిందని భావించారు.

అందుకే వీరభద్రుడు (కరుప్పు) నిర్మాతలు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఎలాగూ విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడు కాబట్టి ఇంక టెన్షన్ లేదనుకుని మే 14 మరోసారి కన్ఫర్మ్ చేశారు. థియేటర్ అగ్రిమెంట్లు, బెనిఫిట్ షో బుకింగ్స్, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ముందస్తుగా రెడీ అవుతున్నాయి. ట్విస్ట్ ఏంటంటే విజయ్ పార్టీ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గంట గంట మలుపులు తిరుగుతూ పొలిటికల్ డ్రామాగా మారిపోయింది. కథ మళ్ళీ మొదటికే వచ్చింది.

ఈ నేపథ్యంలో వీరభద్రుడు మీద ఆశించిన బజ్ రావడం లేదని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు పోస్ట్ పోన్లలో నలిగిపోయింది. ఆర్జె బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ కం యాక్షన్ డ్రామాలో సూర్య డ్యూయల్ రోల్ చేశాడు. లాయర్, దేవుడుగా రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ కొత్తగా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. అల్లు అర్జున్ రాకాకు పని చేస్తున్న సాయి అభ్యంన్కర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా యూనిట్ చెబుతోంది.

తమిళ సంగతి ఏమో కానీ తెలుగులో దీనికి మంచి ప్రమోషన్స్ చేసుకుంటే మాస్ ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక పెద్ద హీరో నటించిన కమర్షియల్ సినిమా వచ్చి నెలలు అవుతోంది. మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినా అది తీవ్రంగా నిరాశ పరిచింది. ఎలాగూ టాలీవుడ్ జనాలకు భాషాభేదం ఉండదు కాబట్టి వీరభద్రుడులో మినిమమ్ కంటెంట్ ఉన్నా చాలు హిట్ ఇచ్చేస్తారు. ఇందులో త్రిష హీరోయిన్ కావడం ఇప్పుడో ఆకర్షణగా మారిపోయింది.

This post was last modified on May 9, 2026 12:29 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

44 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

2 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

3 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

4 hours ago