బాలయ్య – కొరటాల కాంబోకి ఎవరు కరెక్ట్ ?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే. సంగీత దర్శకుడిగా ఎవరు ఉంటారనే క్వశ్చన్ ఫ్యాన్స్ మెదళ్లను తొలిచేస్తోంది. కొరటాల మనసులో మూడు ఆప్షన్లు ఉండొచ్చు. మొదటిది తమన్. బాలయ్య ఫేవరెట్ కాబట్టి ముందు పరిశీలించాలి. అయితే ఇప్పటికే వీళిద్దరి కాంబోలో అఖండ , వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ తాండవం 2 వచ్చాయి.

ఇప్పుడు గోపీచంద్ మలినేని తీస్తున్న ఎన్బికె 111 కూడా తమన్ ఖాతాలోనే చేరింది. అంటే ఇప్పటిదాకా కౌంట్ అరడజను పూర్తయిపోయింది. సో కొంచెం ఫ్రెష్ గా ఉండాలంటే ఛాయిస్ మార్చుకోవాలి. రెండో పేరు అనిరుధ్ రవిచందర్. దేవరకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు కాబట్టి కొరటాల హ్యాపీనే. కానీ రెమ్యునరేషన్ పరంగా బాలయ్య మూవీకి అంత ఇచ్చి తీసుకోవడం అంటే రిస్క్ అవ్వొచ్చు. పైగా చేతి నిండా ప్రాజెక్టులు ఉన్న అనిరుధ్ అంత ఈజీగా దొరకడు.

లిస్టులో తర్వాతి నేమ్ దేవిశ్రీ ప్రసాద్. బాలయ్య లెజెండ్ కు తను ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడో తెలిసిందే. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. కొరటాల శివతో తనకు బాండింగ్ ఉంది. డెబ్యూ మూవీ మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అన్నీ ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్లు. ఆచార్యకు మణిశర్మని తీసుకున్నారు. సో దేవి అంటే అన్నివిధాలా సేఫ్ బెట్ అవుతుంది. అయితే ఎల్లమ్మతో హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్ ముందంత ఈజీగా దొరుకుతారో లేదో.

త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. హీరోయిన్ గా నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్ దాదాపు ఫిక్స్. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది. రెండు సినిమాలు సమాంతరంగా చేసేలా బాలయ్య దర్శకులను ఒప్పిస్తున్నట్టు సమాచారం. తర్వాత లిస్టులో విజయ్ కనకమేడల, వివేక్ ఆత్రేయ ఉండటంతో టైం వేస్ట్ కాకుండా వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మలినేని మూవీ అయితే దసరా పండక్కు రిలీజ్ అనుకుంటున్నారని తెలిసింది.