‘టాక్సిక్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక టీవీ షోలో తన కెరీర్ కు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడాడు. ఇదే క్రమంలో సూసైడ్ చేసుకున్న తన అభిమాని అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదన్న దానిపై మరోసారి స్పందించాడు. ఒక పబ్లిక్ ఫిగర్ గా తనకున్న బాధ్యత గురించి వివరంగా చెప్పాడు.
2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని మాండ్య జిల్లా కోడిదొడ్డి గ్రామంలో రామకృష్ణ అనే 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు అతను ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. తన అంత్యక్రియలకు అప్పటి పొలిటీషియన్ సిద్ధరామయ్యతో పాటు తన ఫేవరెట్ హీరో యశ్ కచ్చితంగా రావాలని ఆ లెటర్ లో కోరాడు. అప్పట్లో ఈ న్యూస్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ యువకుడి సూసైడ్ నోట్ చూసి సిద్ధరామయ్య ఆ గ్రామానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కానీ యశ్ మాత్రం ఆ ఊరికి వెళ్లలేదు. దీనికి కారణం చెబుతూ.. తానక్కడికి వెళితే ఫ్యాన్స్ కు రాంగ్ మెసేజ్ వెళుతుందని యశ్ మరోసారి చెప్పాడు. ఇలాంటి పనులు చేస్తే హీరో దిగివస్తాడనే తప్పుడు ఆలోచన మిగతా అభిమానుల్లోకి వెళ్లకుండా ఉండాలనే తాను ఆగానని క్లియర్ చేశాడు. ఫ్యాన్స్ తనను కలవడానికి ఏది కరెక్ట్ రూటో కూడా యశ్ ఈ షోలో పంచుకున్నాడు. ఎవరైనా తమ లైఫ్ లో ఏదైనా సాధించి తన దగ్గరకు వస్తే సంతోషంగా కలుస్తానన్నాడు.
ఒక ఫ్యాన్ సక్సెస్ అయి, తనను ఆ ఈవెంట్ కు పిలిస్తే అక్కడికి వెళ్లడానికి కచ్చితంగా ట్రై చేస్తానని యశ్ తన రూల్ ఏంటో ఓపెన్ గా చెప్పాడు. ఆ యువకుడు చనిపోయినప్పుడు తాను కూడా పర్సనల్ గా చాలా బాధపడ్డానని యశ్ గుర్తు చేసుకున్నాడు. కానీ ప్రాణాలు పోయిన తర్వాత అక్కడికి వెళ్లి తానెలాంటి ఉపయోగం చేయలేనని అన్నాడు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే రేపు ఇంకొందరు అదే దారిలో వెళ్లే రిస్క్ ఉందని, అందుకే తాను అప్పుడు ఆ అంత్యక్రియలకు దూరంగా ఉన్నానని యశ్ తన సైడ్ వెర్షన్ వినిపించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates