తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇంకెవ్వరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఒక పుష్పక విమానం.. ఒక ఆదిత్య 369.. ఒక విచిత్ర సోదరులు.. ఒక భైరవద్వీపం.. మామూలు ప్రయోగాలా ఇవి. హాలీవుడ్ సినిమాలే గొప్ప అనుకునే సమయంలో మనమూ వారికి దీటుగా ప్రయోగాలు చేయమని చాటిన దర్శకుడాయన.
కొన్ని తరాల దర్శకులను ఇన్‌స్పైర్ చేసిన ఘనత ఆయన సొంతం. ఇప్పుడు చూసినా ఆయన సినిమాలు చాలా కొత్తగా అనిపిస్తాయంటే సింగీతం ఎంత అడ్వాన్స్డ్‌గా ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమాకే కాదు.. ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి.
అలాంటి దిగ్గజానికి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ తరఫున చూపిస్తున్న కృతజ్ఞతగా ‘సింగ్ గీతం’ను చెప్పొచ్చు.
ఒకప్పుడు అద్భుతాలను ఆవిష్కరించిన సింగీతం చివరగా తీసిన ‘వెల్కమ్ ఒబామా’ సహా కొన్ని సినిమాలతో మెప్పించలేకపోయారు. 80 ప్లస్ వయసులోనూ ఉత్సాహంగా సినిమాలైతే తీశారు కానీ.. వయసు మీద పడుతున్న ఆయనకు ఆయా చిత్ర బృందాలు ఆశించిన సహకారం అందించలేకపోయాయి.
కోరుకున్న సాంకేతిక-ఆర్థిక సహకారం దక్కకపోవడంతో సింగీతంకు చేదు అనుభవాలు తప్పలేదు. 2013లో వెల్కం ఒబామా తీశాక.. తొమ్మిదేళ్లు విరామం తీసుకుని ‘ప్రతిబింబాలు’ అనే ఇంకో సినిమా తీశారు. కానీ ఫలితం దక్కలేదు.
90ల్లోకి వచ్చాక కూడా సినిమా తీయాలన్న ఉత్సాహం మంచిదే కానీ.. ఆయనకు అన్ని రకాలుగా సహకారం అవసరం. ఈ సహకారాన్నే నాగ్ అశ్విన్ అండ్ టీమ్ అందజేసింది. ఎన్నో ఏళ్ల ముందు అనుకున్న ఒక ప్రయోగాత్మక కథకు నాగి బృందం అన్ని రకాల సహకారం అందించింది.
తాను ‘కల్కి’ తీయడానికి స్ఫూర్తిగా నిలిచిన సింగీతంకు నాగి చూపించిన కృతజ్ఞతగా ఈ సినిమాను చెప్పొచ్చు. ‘35: చిన్న కథ కాదు’ సినిమా తీసిన నందకిశోర్ ఈమాని సహా అరడజను మంది రచయితలను సింగీతానికి ఇచ్చి ఈ స్క్రిప్టును డెవలప్ చేయించడమే కాక.. దగ్గరుండి మేకింగ్‌ను చూసుకున్నాడు నాగి.
వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ సింగీతం కలల సినిమాకు తన వంతు సపోర్ట్ ఇస్తూ మంచి బడ్జెట్ పెట్టి సినిమా తీయించారు. దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు టెక్నీషియన్లు పారితోషకాలు తగ్గించుకుని మరీ ఈ సినిమాకు పని చేశారు. ఇలా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎంతోమంది ఈ సినిమాకు అండగా నిలిచారు.
కాబట్టే సింగీతం 94 ఏళ్ల వయసులోనూ సినిమా తీయగలుగుతున్నారు. నిన్న రిలీజైన టీజర్ చూస్తే ఇదో మంచి ప్రయోగంగా మారేలా కనిపిస్తోంది. సినిమా ట్రెండీగానే ఉంటుందనిపిస్తోంది. ఈ చిత్రానికి ఫిలిం ఇండస్ట్రీ లాగే ప్రేక్షకులు కూడా మద్దతుగా నిలిస్తే దిగ్గజ దర్శకుడి కెరీర్‌కు ఇదొక మంచి ట్రిబ్యూట్‌గా నిలిచే అవకాశముంది.
This post was last modified on May 2, 2026 3:02 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…