బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకు ఆర్జె బాలాజీ దర్శకుడు. దీనికి అధికారికంగా లాక్ చేసిన విడుదల తేదీ మే 14. కానీ రెండు మూడు రోజులుగా నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పెడుతున్న ట్వీట్లలో డేట్ తీసేసి కేవలం నెలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. అంటే ఒక వారం మళ్ళీ వాయిదా పడొచ్చనే అనుమానం చెన్నై వర్గాల్లో వినిపిస్తోంది.
ఇప్పటికే విపరీతమైన జాప్యానికి గురైన వీరభద్రుడు వల్లే సూర్య నెక్స్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ జూలైకు వెళ్లాల్సి వచ్చింది. లేదంటే వేసవిలో విడుదలయ్యేదే. దర్శకుడు వెంకీ అట్లూరి షూట్ ఆల్రెడీ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్థిక కారణాలు, బడ్జెట్ ఎక్కువ కావడం లాంటి కారణాలు వీరభద్రుడుకి ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తూ వచ్చాయి. తీరా అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలో ట్విస్టులు వస్తున్నాయి.
ప్రస్తుతానికి తమిళ వెర్షన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసేసారు. డ్యూడ్, అల్లు అర్జున్ రాకాకు పని చేస్తున్న సాయి అభ్యంన్కర్ సంగీతం సమకూరుస్తున్న వీరభద్రుడులో సూర్య లాయర్, దేవుడుగా రెండు పాత్రలు చేస్తున్నాడు. నయనతారతో అమ్మోరు తల్లి తీసి మెప్పించిన ఆర్జె బాలాజీ ఇప్పుడు కూడా ఏదో డిఫరెంట్ పాయింట్ పట్టినట్టు ఉన్నారు. అయితే మార్కెట్ పరంగా ఇతర భాషల్లో తన బ్రాండ్ పనిచేయకపోవడంతో భారం మొత్తం సూర్య మీద పడింది.
ఇది వచ్చిన రెండు నెలలకే విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ చేసేందుకు నిర్మాత నాగవంశీ రెడీ అవుతున్నారు. వీరభద్రుడు హిట్ అయితే బిజినెస్ పరంగా దానికి హెల్ప్ అవుతుంది. లేదూ ఏదైనా ఎక్కువ తక్కువయ్యిందంటే సక్సెస్ ఇవ్వాల్సిన బాధ్యత వెంకీ అట్లూరి మీద ఉంటుంది. కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సూర్యకు 2026 చాలా కీలకం. ఇప్పటికే మార్కెట్ పరంగా కొంత డౌన్ లో ఉన్న సూర్యకు పై రెండు సినిమాల్లో కనీసం ఒకటి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాల్సిందే.
మనసు మారిందా వీరభద్రుడా
Gulte Telugu Telugu Political and Movie News Updates