Movie News

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ ఈ ఫ్రాంచైజ్ కు చెందిన డిజిటల్ హక్కులు తమకే చెందుతాయని, ఈ డీల్ సెటిల్ అయ్యేవరకు విడుదల ఆపాల్సిందిగా కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత పెన్ స్టూడియోస్ రంగప్రవేశం చేయడం, రిలీజ్ కు అనుకూలంగా పరిణామాలు జరిగిపోవడం చకచకా జరిగాయి.

నిజానికి దృశ్యం ఏప్రిల్ లోనే రావాల్సింది. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల దుబాయ్ లో విడుదల చేయలేమని గుర్తించి వాయిదా వేసుకున్నారు. ఈలోగా ఏవేవో జరిగిపోయాయి. క్రేజ్ ఉంది క్యాష్ చేసుకుందామని ఆ మధ్య దృశ్యం 2ని థియేటర్స్ లో మళ్ళీ విడుదల చేస్తే మోహన్ లాల్ అభిమానులే పట్టించుకోక పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. ఓటిటిలో డైరెక్ట్ రిలీజై అరిగిపోయిన సినిమా మీద డబ్బులు చేసుకుందామని వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టింది.

ఇప్పుడీ దృశ్యం 3 తెలుగు డబ్బింగ్ ఉంటుందో లేదో వీలైనంత త్వరగా క్లారిటీ రావాలి. ఎందుకంటే వెంటనే రీమేక్ చేసేందుకు వెంకటేష్ అందుబాటులో లేరు. ఆదర్శ కుటుంబం అయిపోగానే అనిల్ రావిపూడి షూటింగ్ లో అడుగు పెట్టాలి. సో ఈ ఏడాది మొత్తం లాకైపోయినట్టే. ఒకవేళ తర్వాత చేద్దామా అంటే ఒరిజినల్ దృశ్యం 3 తాలూకు స్పాయిలర్స్, లీక్స్ అన్నీ సోషల్ మీడియాలో వచ్చేసి ఉంటాయి కాబట్టి కంటెంట్ మీద ఎగ్జైట్ మెంట్ తగ్గిపోతుంది.

అటు హిందీలో అజయ్ దేవగన్ పూర్తిగా వేరే కథతో దృశ్యం 3 తీస్తున్నారు. అక్టోబర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అన్ని భాషల్లో ఇది చివరి భాగం. ఇకపై హీరో పాత్ర శవాన్ని ఏం చేస్తుందనే సస్పెన్స్ ఉండదు. దర్శకుడు జీతూ జోసెఫ్ దానికో అర్థవంతమైన ముగింపు ఇచ్చినట్టు కేరళ మీడియా టాక్. ఈసారి థ్రిల్స్ కంటే ఎక్కువగా ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేశారని, అంచనాలు అతిగా పెట్టుకోకుండా గొప్ప అనుభూతి ఇస్తుందని పని చేసిన వాళ్ళు చెబుతున్నారు.

This post was last modified on April 26, 2026 7:48 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

32 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

47 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

48 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago