Movie News

ధనుష్ ‘కర’లో స్టువర్టుపురం ఛాయలు

ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల విషయంలో చూపిస్తున్న అలసత్వం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించేలా ఉంది. రేపో ఎల్లుండో ధనుష్ వచ్చి ఈవెంట్ చేసినా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు అది సరిపోదు. ఇంకేదో సౌండ్ చేయాలి. ఇడ్లి కొట్టు, రాయన్ లాంటివి మన దగ్గర దారుణంగా ఫెయిలవ్వడంతో ఇక్కడ మార్కెట్ ధనుష్ లైట్ తీసుకున్నారేమో బహుశా.

సరే బజ్ సంగతి పక్కనపెడితే కరలో మన స్టువర్ట్ పురం ఛాయలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ఒకప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో దొంగల ఊరిగా బాగా ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. ఈ ఊరి మీద యండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల రాస్తే ఆయన దర్శకత్వంలోనే చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ లో నటించారు. అది డిజాస్టరయ్యింది. అదే టైంలో స్టువర్ట్ పురం దొంగలు అనే మరో భాను చందర్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కొట్టింది. ఇది 1991 నాటి ముచ్చట.

రవితేజ టైగర్ నాగేశ్వరరావు బ్యాక్ డ్రాప్ కూడా దీని ఆధారంగా తీసుకున్నదే. అయితే ఇది పీరియాడిక్ బయోపిక్. కరలో మెయిన్ పాయింట్ స్టువర్ట్ పురం నేపధ్యానికి దగ్గరగా ఉంటుందని, దొంగతనాలకు అలవాటు పడిన ఒక యువకుడి జీవితం సామజిక, రాజకీయ పరిస్థితుల వల్ల ఎలాంటి మలుపులు తీసుకుందనే పాయింట్ మీద దీన్ని రూపొందించారట. ఏప్రిల్ 30 రావాల్సిన పెద్ది తప్పుకోవడంతో కరకు ఇతర రాష్ట్రాల్లో బెనిఫిట్ కానుంది.

ఫలితం మీద ధనుష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మన దగ్గరే కాదు తమిళనాడులోనూ బాక్సాఫీస్ డల్ గా ఉంది. జనవరిలో జన నాయకుడు వాయిదా పడ్డాక అంత ఊపు ఇచ్చే సినిమాలు పెద్దగా రాలేదు. రాధికా తాయ్ కిళవి లాంటివి కొంత ఊరట కలిగించాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు కర కనక సక్సెస్ అయితే థియేటర్లకు ఆక్సిజన్ దొరుకుతుందని బయ్యర్లు ఆశపడుతున్నారు. తమిళ నేటివిటీ నిండిన కరని మనోళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

This post was last modified on April 26, 2026 9:25 am

Share

Recent Posts

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

4 minutes ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

9 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

11 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

11 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

12 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

15 hours ago