తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తనకు దర్శకుడిగా జన్మనిచ్చిన తెలుగు ఇండస్ట్రీలోనే అతను దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. ఇక తన తొలి హీరో పవన్ కళ్యాణ్ అంటే కరుణాకరన్‌కు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘తొలి ప్రేమ’తో పవన్ కెరీర్‌ను కూడా మలుపు తిప్పినప్పటికీ.. పవన్ తనకు అవకాశం ఇవ్వడమే గొప్ప అంటాడు కరుణాకరన్. ‘తొలి ప్రేమ’ తర్వాత కరుణాకరన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘డార్లింగ్’ సినిమా ఇప్పుడు రీ రిలీజై మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లోనూ పవన్ మీద తన ప్రేమను చాటుకుంటూనే ఉన్నాడు కరుణాకరన్.
ఈ సందర్భంగా పవన్‌తో కరుణాకరన్ అనుబంధాన్ని, పవన్ మీద కరుణాకరన్ ఫ్యానిజాన్ని చాటే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘డార్లింగ్’ రిలీజ్ టైంలో ఒక టీవీ షోలో పాల్గొన్న కరుణాకరన్.. ఆ చిత్ర కథానాయిక కాజల్ అగర్వాల్‌తో కలిసి ఒక గేమ్ ఆడారు.
హీరోల ముఖంలో చిన్న పార్ట్ చూపించి అతనెవరో కనుక్కోవడం ఆ గేమ్‌లో భాగం. అందులో జస్ట్ పవన్ గడ్డాన్ని చూపిస్తే అది పవన్ కళ్యాణ్ అని కనిపెట్టేశాడు కరుణాకరన్. దీంతో ఇదేం ఫ్యానిజం బాబోయ్ అంటూ యాంకర్ ఉదయభాను షాకైంది.
పవన్‌కు సంబంధించి ఏ చిన్న విషయమైనా తాను కనిపెట్టేస్తానని.. ఆయనంటే తనకు అంతిష్టమని.. తనకు ఆయన దేవుడు ఇచ్చిన అన్నయ్య అని కరుణాకరన్ వ్యాఖ్యానించాడు అప్పట్లో.
దర్శకుడిగా తనకు తొలి అవకాశం ఇచ్చినందుకు ఇన్నేళ్ల తర్వాత కూడా కరుణాకరన్.. పవన్ మీద అంతే అభిమానం చూపిస్తూ ఉంటాడు. కరుణాకరన్ ఇటీవలే బెల్లంకొండ గణేష్ హీరోగా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ మాటలు అందిస్తుండడం విశేషం.
This post was last modified on April 25, 2026 6:30 pm
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…