Movie News

మాయమైన మెగా కోడలు… వస్తోంది

వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి తర్వాత మధ్యలో ఒక వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించిన లావణ్య.. కొంచెం గ్యాప్ తర్వాత ‘సతీ లీలావతి’ అనే సినిమా చేసింది. ఈ సినిమా గత ఏఢాదే విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాలతో ఆలస్యం అయింది. 

ఈ ఏడాది మార్చి మొదటి వారంలో రిలీజ్‌కు ఏర్పాట్లు చేసినా.. ఎందుకో చివరి నిమిషంలో ఈ చిత్రం రేసు నుంచి తప్పుకుంది. సినిమా వాయిదా పడ్డట్లు కూడా ప్రకటించని మేకర్స్ సైలెంట్‌గా ఉండిపోయారు. ఐతే రెండు నెలల గ్యాప్ తర్వాత కొత్త రిలీజ్ డేట్‌తో రాబోతోంది ‘సతీ లీలావతి’. మే 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

లేడీ ఓరియెంటెడ్ మూవీ అయిన ‘సతీలీలావతి’లో లావణ్య సరసన ‘శాకుంతలం’ ఫేమ్, మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎంఎస్ లాంటి సినిమాలు తీసిన తాతినేని సత్య ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెండు భిన్న కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయి, అబ్బాయి.. పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు.. ఈ క్రమంలో వివాహ బంధంలోని విశిష్ఠతను ఎలా తెలుసుకున్నారు అన్నది ఈ చిత్రంలో చూపించారు. ఇందులో కొన్ని థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. కొత్త నిర్మాత నాగమోహన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. త్వరలోనే ‘సతీలీలావతి’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేయబోతోంది. మే 8న రవిబాబు సినిమా ‘రేజర్’తో ‘సతీలీలావతి’ పోటీ పడబోతోంది.  సినిమా బాగా ఆలస్యమై, రిలీజ్ డేట్‌లు మార్చుకున్న నేపథ్యంలో ఈసారి లావణ్య అండ్ టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేసి సినిమాను పుష్ చేయాల్సిన అవసరముంది.

This post was last modified on April 26, 2026 9:17 am

Share

Recent Posts

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

42 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago