బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి అప్పటి పత్రికల్లో బోలెడు కథనాలు వచ్చేవి. విపరీతమైన వ్యయం వల్ల షూటింగ్ కూడా అనుకున్నంత వేగంగా జరగలేదు. సింగరేణి బొగ్గు కార్మికుల బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ మూవీ ఒకే రోజు బాలయ్య ఇంకో సినిమా బంగారు బుల్లోడుతో క్లాష్ అవ్వాల్సి రావడంతో రెవిన్యూ బాగా నష్టపోయింది. అఫ్కోర్స్ కంటెంట్ కూడా అన్ని వర్గాలను మెప్పించలేదు.
ఇప్పుడీ నిప్పురవ్వ ప్రస్తావనకు కారణం ఉస్తాద్ భగత్ సింగ్. ఇటీవలే ఓటిటిలో దీన్ని చూసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఒక విలువైన పోలిక చెప్పారు. నిప్పురవ్వ ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టేసి సెకండాఫ్ లో లవ్ సీన్స్ పెట్టడం జనాలకు నచ్చలేదని, ఒకవేళ రివర్స్ లో నడిపించి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని కొందరు చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు..ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ శ్రీలీల ప్రేమకథ రెండో సగంలో రావడాన్ని కంపేర్ చేశారు.
ఆయన చెప్పింది అక్షరాలా నిజం. స్క్రీన్ ప్లేలో రాసుకునే పొరపాట్లు ఇలాంటి ఫలితాలకు దారి తీస్తాయి. మరో ముఖ్యమైన పాయింట్ కూడా గోపాలకృష్ణ చెప్పారు. హీరో పోలీస్ ఆఫీసర్ అయ్యుండి రౌడీలను చీమలను చంపినట్టు పదే పదే చూపించడం మైనస్ అయ్యిందన్నారు. తీవ్రవాదుల బ్యాక్ డ్రాప్ పెట్టినా టైటిల్ జస్టిఫికేషన్ జరగలేదని, కాకపోతే క్యారెక్టరైజేషన్, డైలాగుల విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ మంచి ప్రతిభ చూపించారని కొనియాడారు.
ఈ టాపిక్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ కొచ్చిన ప్రయోజనం ఏముందనేది పక్కన పెడితే ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరుచూరి వారి మాటల్లో తప్పకుండా తెలుసుకోవాలి. ఇంద్రని కూడా ఉదహరించిన గోపాలకృష్ణ గారు ఇలాంటి పాఠాలనే యూట్యూబ్ లో వీడియోలుగా పెడుతుంటారు. వాటిని ఔత్సాహిక దర్శకులు సీరియస్ గా ఫాలో అయితే ఎన్నో నేర్చుకోవచ్చు. అవును మరి నాలుగు దశాబ్దాల అనుభవమున్న చేయి తిరిగిన పెన్ను అది.
Gulte Telugu Telugu Political and Movie News Updates