మంచి సినిమా మాస్ చూపిస్తోంది

గత వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు మూడు క్రేజీ సినిమాలు వచ్చాయి. అందులో కంటెంట్ పరంగా బెస్ట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. కానీ ఈ చిత్రం తొలి వీకెండ్లో టాక్ కు తగ్గ వసూళ్లు రాబట్టలేదు. ఈఎన్ఈ భారీ వసూళ్లు రాబట్టగా తమిళ అనువాదం అయిన ఓం కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. మంచి కంటెంట్ ఉండి కూడా ఈ సినిమా కలెక్షన్లలో వెనుకబడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

దీంతో చాలామంది TFI failed here టెంప్లేట్ వెయ్యడం మొదలు పెట్టారు. మంచి సినిమాను ఎంకరేజ్ చెయ్యలేదని తెలుగు ప్రేక్షకుల అభిరుచిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. కానీ వీకెండ్ అయ్యాక పరిస్థితి మారిపోయింది. ‘ఆకాశంలో ఒక తార’ ఫస్ట్ ఛాయిస్ గా మారింది. వీక్ డేస్ లో ఈ సినిమా స్ట్రాంగ్ హోల్డ్ తో ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది.

ఈ సోమవారం నుంచి దాదాపుగా ప్రతి రోజు.. తొలి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తూ దూసుకెళ్తోంది ఈ సినిమా. ఫస్ట్ వీకెండ్ కంటే సెకండ్ వీకెండ్ సినిమాకి బెటర్ ఆక్యుపెన్సీలు, కలెక్షన్లు ఉన్నాయి. శనివారం హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీలు అన్నింట్లో ఈవెనింగ్, నైట్ మెజారిటీ షోలకు ఫుల్స్ పడుతున్నాయి. ఆదివారానికి కూడా బుకింగ్స్ బాగున్నాయి.

వచ్చే వారం వృషకర్మ, అలియాస్ రుక్మిణీ లాంటి ప్రామిసింగ్ మూవీస్ రాబోతున్నాయి. అవి వచ్చే వరకు ‘ఆకాశంలో ఒక తార’కు ఎదురు లేనట్లే. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ఫుల్ రన్లో ఇంకా పెద్ద నంబర్ రావడం ఖాయం. కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ సంపాదించబోతున్నట్లే. కొంచెం లేటుగా అయినా మంచి సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడం శుభ పరిణామం.