Movie News

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో అతిథిగా రావడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. కానీ ఏ హీరో సినిమాకు ఏ హీరో వచ్చాడు అన్నదాన్ని బట్టి అభిమానుల స్పందన ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో కొన్ని అనధికారిక వర్గాలు ఉంటాయి.

ఆయా హీరోలు ఒకరితో ఒకరు ఎలా ఉన్నా సరే.. అభిమానులు మాత్రం ఇలా వేర్వేరు వర్గాల్లో ఉంటారు. ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో తెగ కొట్టేసుకుంటూ ఉంటారు. ఒక వర్గం హీరో సినిమా కోసం ఇంకో వర్గం హీరో అతిథిగా వచ్చాడంటే ఫ్యాన్స్ ఆశ్చర్యపోయి చూస్తారు. ఇప్పుడు అదే జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో నేచురల్ స్టార్ నాని తళుక్కుమన్నాడు.

‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఇటీవలే విజయ్ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆరంభ వేడుక సోమవారం జరిగింది. ఈ ఈవెంట్‌కు నాని అతిథిగా విచ్చేయగా.. వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నాని, విజయ్ అగ్ర కథానాయకులేమీ కాదు. వీళ్లిద్దరినీ రైవల్ హీరోలుగా చూడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఇద్దరికీ మంచి అనుబంధమే ఉంది. నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో చేసిన ప్రత్యేక పాత్రతోనే విజయ్‌కు పేరొచ్చింది.

ఐతే గత కొన్నేళ్లలో విచిత్రంగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు శత్రువులుగా మారిపోయారు. పరస్పరం అవతలి హీరోను వీళ్లు కించపరచడం.. కారణం లేకుండా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం మామూలైపోయింది. మిడ్ రేంజిలో ఈ ఇద్దరు హీరోల్లో ఒకరి మధ్య ఒకరికి ప్రొఫెషనల్‌గా పోటీ ఉన్న నేపథ్యంలో తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అనుకోవడం..

అవతలి హీరోను డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేయడం అభిమానుల్లో మామూలైపోయింది. ఫ్యాన్ వార్స్ మరీ ఈ స్థాయికి పడిపోయాయి ఈ మధ్య. కానీ నాని, విజయ్ మధ్య ఏమీ లేదని.. ఇద్దరూ మంచి స్నేహితులని ఈ రోజు మరోసారి రుజువైంది. ఇది చూసి అయినా ఫ్యాన్స్.. అనవసర గొడవలు మానుకుంటే మంచిది.

This post was last modified on April 21, 2026 10:14 am

Share

Recent Posts

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 minute ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

3 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

3 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

6 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

9 hours ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

10 hours ago