ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. కెరీర్లో ఎక్కువగా కామెడీ సినిమాలు ట్రై చేసిన అతను.. కపుల్ ఫ్రెండ్లీ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో సక్సెస్ సాధించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ ఇందులో కూడా అక్కడక్కడా తన కామెడీ టైమింగ్ చూపించాడు సంతోష్.
ఈ హిట్ తర్వాత ఆత్మవిశ్వాసం పుంజుకున్న అతను.. తన స్టయిల్లో కామెడీ సినిమాకు రెడీ అవుతున్నాడు. సంతోష్ కొత్త సినిమా టైటిల్ చూస్తేనే నవ్వు రావడం ఖాయం. సత్తిబాబు పరలోక యాత్ర.. ఇదీ సంతోష్ కొత్త సినిమా టైటిల్. కొన్నేళ్ల ముందు బెల్లంకొండ గణేష్ హీరోగా స్వాతిముత్యం అనే మంచి ఫన్ మూవీ తీసిన లక్ష్మణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
సంతోష్ శోభన్‌కు ఆస్థాన నిర్మాణ సంస్థలా మారిన యువి క్రియేషన్సే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతోంది. ఏఆర్ ఫిలిమ్స్ కూడా ఈ చిత్రంలో భాగస్వామిగా ఉండనుంది. సంతోష్‌కు కెరీర్లో తొలి విజయాన్నందించింది యువి క్రియేషన్సే. ఆ సంస్థలో తెరకెక్కి నేరుగా ఓటీటీలో రిలీజైన ఏక్ మిని కథ మంచి ఫలితాన్నందుకుంది. ఆ తర్వాత అతను చాలా సినిమాలు ట్రై చేశాడు కానీ.. అవేవీ ఫలితాన్నివ్వలేదు.
ఎట్టకేలకు కపుల్ ఫ్రెండ్లీతో అతను సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. స్వాతిముత్యంలో కొత్త పాయింట్ మీద చాలా సరదాగా సినిమాను నడిపించి ప్రశంసలు అందుకున్నాడు లక్ష్మణ్. ఐతే ఆ సినిమా కమర్షియల్‌గా అనుకున్నంత విజయం సాధించలేదు. ఈసారి సంతోష్ లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోతో అతను వినోదాత్మక చిత్రం చేయబోతున్నాడు. మేకర్స్ కూడా ఇదొక హిలేరియస్ మూవీ అని అనౌన్స్‌మెంట్‌లోనే చెబుతున్నారు. మరి సంతోష్, లక్ష్మణ్ కలిసి ఎంతమేర నవ్విస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates