Movie News

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం ప్రపంచాన్ని స్పెల్ బౌండ్ చేస్తుందని, అందరూ దీని గురించే మాట్లాడుకుంటారని, సోషల్ మీడియా ఊగిపోతుందని చాలా మంది భావించారు. ముంబైలో స్పెషల్ ప్రీమియర్ చూసిన మెజారిటీ మీడియా ప్రతినిధులు సైతం అదే అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ రావడం షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా దర్శక నిర్మాతలకు ఇది పెద్ద ట్విస్ట్.

ఎందుకంటే రామాయణ టీజర్ వచ్చాక ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ మరోసారి ట్రోలింగ్ బారిన పడతారని ఎక్స్ పెక్ట్ చేసిన వాళ్లే ఎక్కువ. కానీ అలాంటిది జరగలేదు. ఒకవేళ రామాయణ యునానిమస్ రెస్పాన్స్ తెచ్చుకుని ఉంటే అదే అయ్యేది కానీ రన్బీర్ కపూర్ లుక్ బాగున్నప్పటికీ మిగిలిన క్యారెక్టర్లను రివీల్ చేయకపోవడం, కొన్ని విజువల్స్ లో ఏఐ ఛాయలు స్పష్టంగా కనిపించడం కొంత మైనస్ అయ్యింది. ఓవరాల్ గా చెప్పాలంటే గుడ్ అనే స్టాంప్ అయితే వేసుకుంది.

అసలు సమస్య ఇది కాదు. నిర్మాత నమిత్ మల్హోత్రా పలు ఇంటర్వ్యూలలో రామాయణ మొత్తం బడ్జెట్ నాలుగు వేల కోట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. సో అంచనాలు అదే స్థాయిలో ఏర్పడటం సహజం. టీజర్ బిగ్ స్క్రీన్ మీద చూడని వాళ్లకు అలా అనిపిస్తుందని ఏదో సమర్ధించుకునే ప్రయత్నం ఎవరైనా చేసినా, రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి కంటెంట్లను స్మార్ట్ ఫోన్ లో సైతం గూస్ బంప్స్ వచ్చే స్థాయిలో ఎలా చూపిస్తాడనే లాజిక్ బయటికి వస్తుంది.

మొత్తానికి రామాయణ టీమ్ కొంత డిఫెన్స్ పడేలా ఇవాళ జరిగిన ట్రెండ్స్ దోహదం చేశాయి. నెక్స్ట్ సీత, రావణుడి టీజర్లు వస్తాయి. ఆపై ట్రైలర్ ఉంటుంది. పాటలు రావాలి. సో పబ్లిసిటీలో కీలక ఘట్టాలు చాలానే ఉన్నాయి. వీటిని వదలబోయే ముందు రామకు వచ్చిన రియాక్షన్లు గుర్తు పెట్టుకుని అలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా క్వాలిటీ చెక్ చేసుకునే బాధ్యత మేకర్స్ మీద ఉంది. తెలుగు  ఫ్యాన్స్ కి మాత్రం రామాయణ టీజర్ సంతృప్తినివ్వలేదు. సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది.

This post was last modified on April 2, 2026 11:06 pm

Share

Recent Posts

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

15 minutes ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

4 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

5 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

6 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

6 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

7 hours ago